స్విగ్గీ స్టోర్స్…నిత్యావసర సరుకులు కూడా ఆర్డర్ చెయ్యవచ్చు

ఇకపై ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేందుకు స్విగ్గీ కంపెనీ రెడీ అయింది. దీనికోసం మంగళవారం(ఫిబ్రవరి-12, 2019) స్విగ్గీ స్టోర్స్ లను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా హర్యానా రాష్ట్రంలోని గురుగావ్ లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. కూరగాయలు, ఫ్రూట్స్, కిరణాసామాగ్రి, హెల్త్ కేర్ కి సంబంధించిన వాటితోపాటు ఇతర అనేక నిత్యావసర సరుకులను నేరుగా ఇంటి దగ్గరకే డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

త్వరలో ఇతర మెట్రో సిటీల్లో కూడా ఈ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. పట్టణ వినియోగదారుల జీవన నాణ్యతను పెంచడంలో స్విగ్గీ తొలి మైలురాయి దాటిందని కంపెనీ సీఈవో శ్రీహర్ష మాజేటి తెలిపారు. ఇప్పటివరకు ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడంలో వినియోగదారులకు మంచి అనుభూతి పంచిన స్విగ్గీ ఇకపై నిత్యావసర వస్తువుల సరఫరాలో కూడా ఇటువంటి అనుభూతినే అందిస్తుందని ఆయన అన్నారు. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం