ఎవరికీ మద్దతివ్వను : బీజేపీ మేనిఫెస్టోపై రజనీ ప్రశంసలు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై రజనీ ప్రశంసలు కురిపించడమే దీనికి కారణం.మంగళవారం చెన్నైలో రజనీ మాట్లాడుతూ…వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ గురించి తాను మాట్లాడుతూ ఉన్నానని,వాజ్ పేయి తన ఆలోచనను స్వీకరించారని తెలిపారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం

బీజేపీ తమ 2019 ఎన్నికల మెనిఫెస్టోలో ఈ ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చిందని..ఇది కనుక జరిగితే ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే..వెంటనే మొదటిగా ఈ ప్రాజెక్టును టేకప్ చేయాలని,ఇది ప్రజలకు చాలా మేలు చేకూరుస్తుందని రజనీ అన్నారు.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో, అదేవిధంగా తమిళనాడు ఉప ఎన్నికల్లో రజనీ తమకు మద్దతు ప్రకటించాలని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ చేసిన విజ్ణప్తిపై రజనీ స్పందిస్తూ…ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని సృష్టం చేశారు.తాను గతంలో కూడా ఇదే మాట చెప్పానని..ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నానని తెలిపారు.దీనిని పెద్ద ఇష్యూగా మార్చి,తమ మధ్య ఫ్రెండ్ షిప్ ను నాశనం చేయవద్దని మీడియాకు రజనీ విజ్ఱప్తి చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను