మ్యాప్‌లో మార్పులకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం

  • Publish Date - June 13, 2020 / 03:46 PM IST

నేపాల్ పార్లమెంట్ శనివారం రాజ్యంగబద్ధమైన బిల్లుకు ఓటింగ్ నిర్వహించింది. దేశానికి సంబంధించిన మ్యాప్ అప్ డేట్ చేసేందుకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. ఇండియా తమకు చెందినదిగా చెప్తున్న పర్వతభూభాగాన్ని తమ సొంతం చేసుకోవాలని నేపాల్ చూస్తుంది. అమెండ్ బిల్లుపై చర్చ మొదలుపెట్టి ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. 

275మంది ఉన్న సభలో అనుకూలంగా 258ఓట్లు వచ్చాయి. దీంతో 2/3వంతు మెజార్టితో బిల్లు పాస్ అయింది. ఆర్టిఫిషియల్ ఎన్లార్జ్‌మెంట్‌తో మ్యాప్ అప్‌డేట్ చేయడాన్ని ఇండియా తప్పుపడుతుంది. 

‘భారత భూభాగానికి సంబంధించిన ప్రాంతాన్ని నేపాల్ దేశ మ్యాప్ లో కలుపుకోవాలని నేపాల్ పార్లమెంటులో రాజ్యాంగపరమైన బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలిసింది. దీనిపై మేం ఇప్పటికే చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం’ అని భారత విధేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. 

ఈ కృత్రిమ విస్తరణ.. చరిత్రలో ఆధారం లేని విషయాలను సహించేది లేదు. సరిహద్దు విషయాలపై మాట్లాడుతున్న సమయంలో వీరు చేసిన పని ఉల్లంఘించినట్లే పరిగణిస్తాం’ అని ఆయన అన్నారు. 

ఈ కొత్త మ్యాప్‌లో కాళి నది తూర్పు భాగం ఉంది. ఉత్తరాఖాండ్ లోని లిపులేఖ్ ప్రాంతం, లింపియాధురా, కాలాపానీ వంటి ప్రాంతాలను కలుపుకోవాలని చూస్తుంది నేపాల్. చైనాతో 1962లో యుద్ధం జరిగిన తర్వాత నుంచి భారత్ వాటిని పర్యవేక్షిస్తూ వస్తుంది.