PF గుడ్ న్యూస్: UAN కావాలంటే కంపెనీతో పనిలేదు

PF గుడ్ న్యూస్: UAN కావాలంటే కంపెనీతో పనిలేదు

Updated On : November 2, 2019 / 7:45 AM IST

పీఎఫ్(ఉద్యోగుల భవిష్య నిధి)అకౌంట్ హోల్డర్లకు శుభవార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కంపెనీతో పనిలేకుండా యూనివర్సల్ అకౌంట్‌(UAN)ను నేరుగా పొందొచ్చని శుక్రవారం ప్రకటించింది. పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోవాలన్నా.. అడ్వాన్స్ అమౌంట్ విత్ డ్రా చేసుకోవాలన్నా యూఏన్ నెంబర్ తప్పనిసరి. ఈ నెంబర్ కావాలంటే కచ్చితంగా కంపెనీ నుంచే తీసుకోవాలి. కంపెనీ మారిన ప్రతిసారీ ఈ నెంబ‌రుతో పీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ క్లెయిమ్‌ చేసుకోవ‌చ్చు.

ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్, త‌మ 65 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల కోసం మ‌రో కొత్త స‌దుపాయాన్ని కూడా అందిస్తుంది. పర్సనల్‌గా అప్లై చేసుకోవాలనుకుంటే డిపాజిట‌రీ ఎల‌క్ట్రానిక్ పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ ను తీసుకురానున్నారు. ఈపీఎఫ్ఓ, నేష‌న‌ల్ ఇ-గ‌వ‌ర్నెన్స్ డివిజ‌న్‌(ఎన్ఇజీడీ)తో క‌లిసి ప‌నిచేస్తుంది. కాగిత రహిత వ్య‌వ‌స్థ దిశ‌గా ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న చర్యల్లో ఇదొకటి. 

ఈపీఎఫ్ఓ 67వ వార్షికోత్సవం సంద‌ర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వ‌ర్ ఈ కొత్త సౌకర్యాలను ప్రకటించారు. ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓలో 6 కోట్ల‌కు పైగా అకౌంట్ హోల్డర్లు ఉన్నారు. సుమారుగా రూ. 12.7 ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ వినియోగాన్ని ఈపీఎఫ్ఓ పర్యవేక్షిస్తుంది.