Goa
Helipad tour in Goa: అందమైన బీచ్ లు, మనసు కట్టిపడేసే ప్రకృతి అందాలు..ప్రశాంత జీవనానికి నిలయం ‘గోవా’. అందుకే ఏ కాస్త సమయం దొరికినా పర్యాటకులు ముందుగా గోవాకు వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తుంటారు. సముద్రంలో బోట్ రైడ్, పారాగ్లైడింగ్ వంటి ఆటలు పర్యాటకులని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక గోవాకు వచ్చే పర్యాటకులకు మరింత అనుభూతి పంచేలా సరికొత్త పర్యాటకం అందుబటులోకి వచ్చింది. ఆకాశంలో విహరిస్తూ గోవా అందాలను ఆస్వాదించేలా..హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గోవా రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా..”BLADE India” సంస్థతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హెలి టూరిజంగా పిలువబడే ఈ పర్యాటకంలో భాగంగా ముందుగా మూడు హెలికాఫ్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
Other Stories:Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
గోవా విమానాశ్రయం నుండి నార్త్ గోవా, దక్షిణ గోవాకు ”బై ది సీట్” హెలికాప్టర్ సేవలను అందిస్తుంది బ్లేడ్ ఇండియా. ఆసక్తిగల పర్యాటకులు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సీటును బుక్ చేసుకోవచ్చు. పర్యాటకుల కోసం స్థానికంగా 10-15 నిమిషాల చిన్న ప్రయోగాత్మక హెలికాప్టర్ రైడ్‌ను కూడా ఎంచుకోని గోవా అందాలను ఆకాశం నుండి ఆస్వాదించవచ్చు. ముంబై, పూణే మరియు గోవాకు సమీప నగరాల నుండి వచ్చే పర్యాటకులైతే మొత్తం హెలికాప్టర్ ను అద్దెకు తీసుకోవచ్చు. గోవాలోని అందమైన బీచ్‌ల మీదుగా ఎగరడం ఖచ్చితంగా పర్యాటకులకు ఒక అద్భుత అనుభూతిని కలిగిస్తుందని బ్లేడ్ ఇండియా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తమ హెలికాప్టర్ సేవలకు మంచి స్పందన వస్తున్నట్లు పేర్కొన్నారు.
other stories:Luck turned overnight: అదృష్టం అంటే ఇతనిధే: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కశ్మీర్ వ్యక్తి