Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ

గోవాలోని 45.2 శాతం కుటుంబాలు కారు కలిగి ఉండగా, 86.7 శాతం కుటుంబాలు ద్విచక్రవాహనాన్ని కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది.

Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ

Gioa

Vehicles in Goa: దేశంలోనే అత్యధిక వాహన సాంద్రత కలిగిన రాష్ట్రంగా గోవా నిలిచింది. మొత్తం 16 లక్షలు జనాభా ఉన్న గోవాలో 15.27 లక్షల వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో 70.81 శాతం ద్విచక్ర వాహనాలు కాగా మిగతా 22.77 శాతంలో కార్లు, లారీలు, ట్రక్ వంటివి ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం..మొత్తం భారతీయ కుటుంబాలలో 7.5 శాతం మంది నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉన్నారు. 49.7 శాతం భారతీయ కుటుంబాలు ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు. గోవాలోని 45.2 శాతం కుటుంబాలు కారు కలిగి ఉండగా, 86.7 శాతం కుటుంబాలు ద్విచక్రవాహనాన్ని కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది. 24.2 శాతం నాలుగు చక్రాల వాహనాలతో కేరళ రెండో స్థానంలో ఉండగా, 75.6 శాతంతో రెండో అత్యధిక ద్విచక్ర వాహనాలతో పంజాబ్ ఉన్నాయి.

other stories:Heavy Rains: చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వానలు

గోవాలో అత్యధిక సంఖ్యలో వాహనాలు ఉన్నందున, పార్కింగ్, స్థల సేకరణ వంటి సమస్యలను ఎదుర్కొంటోంది ప్రభుత్వం. దీంతో కొత్త కార్ల రిజిస్ట్రేషన్‌ను తగ్గించాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. గోవాలో కొత్త కార్ల రిజిస్ట్రేషన్ల సంఖ్యను తగ్గించాలని తాము యోచిస్తున్నామని గోవా రవాణా మంత్రి మౌవిన్ గోడిన్హో చెప్పారు. గోవాలో నానాటికి పెరుగుతున్న వాహన రద్దీ కారణంగా రహదారి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రస్తుతానికి కొత్త వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యను తగ్గించడం ద్వారా రోడ్లపై రద్దీని కొంతమేర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మౌవిన్ గోడిన్హో చెప్పారు.

other stories:BJP Ultimatum: పెట్రో ధరల తగ్గింపుపై తమిళనాడు ప్రభుత్వానికి బీజేపీ అల్టిమేటమ్

ఇక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి సరిగా లేకపోగా..ఉన్న వాహనాలతో రద్దీ పెరిగిపోతుంది. పర్యాటకం పై ఆధారపడ్డ గోవాలో..పర్యాటకుల కోసం ప్రత్యేకంగా సెల్ఫ్ డ్రైవింగ్ టూ వీలర్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో గోవా రోడ్లను, డ్రైవింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేని పర్యాటకులు తరచూ ప్రమాదాల భారిన పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని.. తద్వారా దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో గోవా కూడా అగ్ర స్థానంలో ఉందని గోవా రవాణా మంత్రి మౌవిన్ గోడిన్హో అన్నారు. ప్రైవేట్ క్యాబ్, రెంటెడ్ టూ వీలర్ లపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్న గోవాలో..కార్పొరేట్ ట్రావెల్ కంపెనీలు, ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీస్ సంస్థలు కూడా లేవు.