NTK leader Seeman made Controversial comments on migrant workers
NTK leader Seeman: తమిళనాడు రాష్ట్రంలో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని గత వారం రోజులుగా రేగిన కలకలం.. బిహార్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం విచారణతో కాస్త సద్దుమణిగింది. వాస్తవానికి బిహార్ కార్మికులపై దాడులు జరిగాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఉద్దేశపూర్వకంగా తీసినవని, అదంత స్క్రిప్ట్ అని ఆ బృందం తేల్చింది. దీంతో పరిస్థితులు కొంత సద్దుమణిగాయని అనుకునే లోపే నాం తమిళర్ కాల్చి నేత సీమన్ బాంబ్ పేల్చారు. తాము అధికారంలోకి వస్తే హిందీ కార్మికులను రాష్ట్రం నుంచి వెల్లగొడుతామంటూ వివాదాస్పదంగా స్పందించారు.
Bangalore Auto Driver: హిందీ-కన్నడ గొడవ.. ‘నార్త్ ఇండియన్ బిచ్చగాళ్లు’ అంటూ తిట్టిన ఆటో డ్రైవర్
కాగా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని వలస కార్మికుల పట్ల విధ్వేష ప్రసంగాలు, విధ్వేష చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘‘నకిలీ వీడియోల ఆధారంగా ద్వేషం, హింసను రెచ్చగొడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ తమిళనాడులో హిందీ మాట్లాడే ప్రజలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని ట్వీట్ చేశారు.
Separate Muslim Nation: ప్రత్యేక ముస్లిం దేశం డిమాండ్ చేస్తామంటూ మౌలానా తౌకీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఫిబ్రవరి 14న ఈరోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మీద కంగల్ పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయింది. ఈ విషయమై ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి మోహన్ మాట్లాడుతూ ‘‘ఈ ప్రసంగం అనంతరం ఫిబ్రవరి 22, 2023న సీమాన్‌పై కేసు నమోదు అయింది. ఐపీసీలోని సెక్షన్లు 153B(సీ) కింద ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం. మతం, జాతి, భాష, ప్రాంతీయ సమూహం, కులం లేదా సంఘం వంటి వాటి ఆధారంగా విధ్వేషం రెచ్చగొట్టినందుకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 505(1)(సి) (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటనలు), క్రిమినల్ బెదిరింపులకు గాను సెక్షన్ 506 (1) (నేరమైన బెదిరింపులకు శిక్ష) ప్రకారం కేసు నమోదు అయింది.” అని పేర్కొన్నారు.