Naveen Jindal : పేరు తెచ్చిన తంటా.. ఆ నవీన్ జిందాల్ ఈ నవీన్ జిందాల్ వేర్వేరంటున్న జిందాల్ స్టీల్స్

ఒక్కోసారి పేరు కూడా సమస్యను తెచ్చి పెడుతుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉండటం ఇబ్బందులు తెస్తుంది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది.

Naveen Jindal

Naveen Jindal : ఒక్కోసారి పేరు కూడా సమస్యను తెచ్చి పెడుతుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉండటం ఇబ్బందులు తెస్తుంది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. చేయని తప్పుకి విమర్శల పాలు కావాల్సి వస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. కొన్ని మీడియా సంస్థలు మరో వ్యక్తికి బదులుగా ఈయన ఫొటోలను వాడేస్తున్నాయి. దీంతో చేయని తప్పుకి ఆయన టార్గెట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

Naveen Jindal: ఆ సమాచారం షేర్ చేయొద్దు.. నవీన్ జిందాల్ వినతి

అసలేం జరిగిందంటే.. ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్ జాతీయస్థాయిలో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే ఈ వార్తలు రాసే క్రమంలో కొన్ని మీడియా సంస్థలు తమ చైర్మన్ నవీన్ జిందాల్ ఫొటోను వాడుతున్నాయని జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ సంస్థ ఆరోపిస్తోంది. అంతేకాకుండా, సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు కూడా తమ చైర్మన్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారని వివరించింది.

Asaduddin Owaisi: ఆ ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: అసదుద్దీన్

ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది. నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధం లేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరి, ఈ ప్రకటనతో అయినా  మార్పు వస్తుందో లేదో, తమ తప్పుని సరిదిద్దుకుంటారో లేదో, నవీన్ జిందాల్ ఫొటోలను వాడటం ఆపేస్తారో లేదో చూడాలి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా.. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. తనను చంపుతామని చాలామంది బెదిరిస్తున్నారని నవీన్ వాపోయారు. తనకు, తన కుటుంబానికి ముప్పు పొంచి ఉన్ననేపథ్యంలో తమకు సంబంధించిన ఏ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తన ఇంటి అడ్రస్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, ఇస్లామిక్ సంస్థల నుంచి తన కుటుంబానికి ముప్పు ఉందని, ఏ సమాచారం షేర్ చేయొద్దని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోరారు.