Naveen Jindal: ఆ సమాచారం షేర్ చేయొద్దు.. నవీన్ జిందాల్ వినతి

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్‌తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Naveen Jindal: ఆ సమాచారం షేర్ చేయొద్దు.. నవీన్ జిందాల్ వినతి

Naveen Jindal

Naveen Jindal: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్‌తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని నవీన్ అంటున్నారు. తనకు, తన కుటుంబానికి ముప్పు పొంచి ఉన్ననేపథ్యంలో తమకు సంబంధించిన ఏ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన కోరారు. తన ఇంటి అడ్రస్‌ను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని, ఇస్లామిక్ సంస్థల నుంచి తన కుటుంబానికి ముప్పు ఉందని, ఏ సమాచారం షేర్ చేయొద్దని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోరారు.

COVID-19: వరుసగా రెండోరోజు ఎనిమిది వేలు దాటి కరోనా కేసులు

అలాగే తనను బెదిరింపులకు గురి చేస్తున్న ఒక నెంబర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన షేర్ చేశారు. ఆ నెంబర్ గల వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీన్, ఢిల్లీ పోలీసులను కోరారు. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో గత వారం నవీన్ జిందాల్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. పంజాబ్‌లో ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. తాజాగా దేశవ్యాప్తంగా అల్లర్లూ జరుగుతున్నాయి.