Naveen Patnaik fathers memorial
Naveen Patnaik fathers memorial : రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ అభివృద్ధికే పెద్ద పీట వేయాలి. దానికి కోసం ఏమైనా చేయాలి.. అదే చేశారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. సింపుల్ సిటీని నిలువెత్తు నిదర్శనంగా ఉండే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.సీఎం అంటూ హంగా ఆర్భాటం..దర్పం హడావిడి అవేవీ కనిపించవు నవీన్ పట్నాయక్ లో. అటువంటి ఆయన మరో గొప్ప పనితో మరోసారి హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు.
అభివృద్ధి చేసే విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చిన ముందుకే అడుగేసే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ఎవరినీ లెక్క చేయరని అని కూడా అంటారు. దానికి కోసం తన సొంత విషయాలను కూడా రాష్ట్రాభివృద్దికి అడ్డు వస్తే తొలగించుకుంటు అభివృద్దిబాటలో నడుస్తారనే పేరుంది. 2019లో పూరీలోని శ్మశానవాటికలో చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డంగా ఉందన్న ఉద్దేశంతో నవీన్ పట్నాయక్ తన తండ్రి సమాధినే తొలగించారట. పూరీలోని స్వర్గ్ ద్వారాలో ఉన్న తన తండ్రి బిజూ పట్నాయక్ సమాధిని తొలగించాలని ఆదేశించారని సీనియర్ బ్రూరోక్రాట్, ఆయన ప్రైవేట్ సెక్రటరీ వీకే పాండ్యన్ తాజాగా వెల్లడించారు. దీంతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి వార్తల్లో నిలిచారు.
పూరీ అంటూ అంతర్జాతీయ యాత్రీకులను ఆకర్షించే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో అభివృద్ది కోసం నగర సుందరీకరణ కోసం తండ్రి సమాధి అడ్డుకాకూడదనే ఉద్ధేశంతో దాన్ని తొలగించాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారని దుబాయ్‌లో మంగళవారం (మే16,2023) నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న పాండ్యన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రజలకు మేలు జరుగుతుంది అంటూ దేన్నైనా ఆయన ఎదుర్కొంటారని..అభివృద్ది విషయంలో ఎటువంటి రాజీ పడరని తెలిపారు.కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని పాండ్యన్ వెల్లడించారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు. తనకు నవీన్ పట్నాయక్ తో 13ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆయన ప్రైవేట్ సెక్రటరీ పాండ్యన్ తెలిపారు.
ఇప్పుడు స్వర్గద్వారలో బిజు పట్నాయక్ స్మారక చిహ్నం కేవలం చిన్న ఫలకం మాత్రమే ఉందని తెలిపారు. తన తండ్రి ఓ సమాధిలోనే ఉండరని తన గుండెల్లో ఎప్పటికి ఉంటారని సమాధిని తొలగించాలని ఆదేశించిన సందర్భంగా నవీన్ పట్నాయక్ అన్నారని పాండ్యన్ వెల్లడించారు. నవీన్ పట్నాయకే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా అదే మాట చెప్పారని తెలిపారు. నవీన్ పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్‌లో భారీ సమాధిని నిర్మించారు. దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యన్ తెలిపారు.