Odisha Congress : ఒడిషాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేపధ్యంలో తాజాగా ఒడిషాలో హస్తానికి గట్టి ఎదుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒడిషాలో
- venkaiahnaidu
- Published On : October 22, 2021 / 01:16 PM IST
Odisa
Odisha Congress పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేపధ్యంలో తాజాగా ఒడిషాలో హస్తానికి గట్టి ఎదుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒడిషాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న వేళ… ఒడిషా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(OPCC)వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ మాఝీ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన తన రాజీనామా లేఖను పంపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
ప్రముఖ ట్రైబల్ లీడర్ మరియు నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ అయిన ప్రదీప్ మాఝీ సోనియాకు రాసిన లేఖలో..తాను కాంగ్రెస్‌లో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకున్నానని, అయితే పార్టీలో ఉత్సాహం లేదని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థను మీ క్రియాశీలకమైన నాయకత్వం చాలా బాగా నిర్వహించింది. ఇది వివిధ స్థాయిలలో కీలక పదవులను ఆక్రమించిన వ్యక్తుల కారణంగా క్రమంగా క్షీణించింది. ఇప్పుడు పార్టీ దాదాపుగా విశ్వసనీయతను కోల్పోయింది. ఇది పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతుందని ప్రదీప్ మాఝీ పేర్కొన్నారు.
అయితే ఈ నెలలో నవీన్ పట్నాయక్ నబరంగ్‌పూర్ పర్యటనకు వెళ్లనుండగా..ఆ సమయంలో ప్రదీప్ మాఝీ అధికార బిజూ జనతాదళ్ పార్టీలో చేరతారని సమాచారం. నబరంగ్‌పూర్ మరియు మల్కాన్ గిరి జిల్లాల్లోని గిరిజన వర్గాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా ప్రదీప్ మాఝీకి పేరుంది. కాగా,2019 ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నబా కిషోర్ దాస్..ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.
ALSO READ China Toys Danger : చైనా బొమ్మల్లో ప్రమాదకర రసాయనాలు..చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమంటున్న నిపుణులు
