Minister Naba Kishore Das : ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ కన్నుమూశారు. భువనేశ్వర్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ పై ఓ పోలీసు కాల్పులు జరపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ జరిపిన కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయను వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ఛాతిలో రెండు బుల్లెట్లు ఉండడంతో చికిత్స కష్టమైంది. పరిస్థితి విషమించడంతో మంత్రి నబకిశోర్ దాస్ తుదిశ్వాస విడిచారు.
ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. బుల్లెట్ గాయాలకు గురైన మంత్రిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
అటు, కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Also Read..Odisha: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. 22 కులాలను SEBC జాబితాలోకి
ఆదివారం ఉదయం మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ ప్రారంభించేందుకు మంత్రి వచ్చారు. బ్రిజ్ రాజ్ నగర్ లోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న మంత్రి కిశోర్.. వాహనం దిగుతున్న సమయంలో ఏఎస్ఐ గోపాల్ దాస్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాగా, కాల్పులు జరపడానికి కారణం తెలియాల్సి ఉంది. దాడి విషయం తెలియగానే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏఎస్ఐ గోపాల్ దాస్.. ఉద్దేశపూర్వకంగానే ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నబా కిషోర్ దాస్ ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి. బీజేడీ సీనియర్ నేత. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ చేతిలో కాల్పులకు గురయ్యారు. జార్సుగూడ జిల్లాలో బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
మన్సిపల్ చైర్మన్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి.. కారు దిగుతున్న సమయంలో సమీపం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడిని ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు. సొంత రివాల్వర్ తోనే అతడు కాల్పులకు పాల్పడ్డాడు. మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇంకా తెలియలేదని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు.