Purna Chandra Swain: 10th calss పాస్ అయిన ఎమ్మెల్యే

ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్‌ ఎట్టకేలకు 10th Class పరీక్ష పాస్ అయ్యారు.

Mla Purna Chandra Swain Pass In 10th Class Exam 

MLA Purna Chandra Swain Pass In 10th Class Exam  : ఓ ఎమ్మెల్యే ఎట్టకేలకు 10th Class పరీక్షలు పాస్ అయ్యారు. దీంతో ఆయన అనుకున్నది సాధించానను తెగ సంబరపడిపోతున్నారు. పదే పదే 10th Class పరీక్షలు రాసిన ప్రతీసారి ఫెయిల్ అవుతున్న సదరు ఎమ్మెల్యే ఎట్టకేలకు 10th Class పరీక్ష పాస్ అయ్యారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అంటే..ఒడిశా బిజు జనతాదళ్ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్‌. పైగా ఎమ్మెల్యే బి గ్రేట్ లో పాస్ కావటం విశేషం.

ఒడిశాలోని గంజాం జిల్లా సురడా నియెజకవర్గ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వయ్‌ రాష్ట్ర ప్రభుత్వం 10th Class ఫలితాలను మంగళవారం (ఆగస్టు 24.2021) ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఎమ్మెల్యే స్వయ్‌ 500 మార్కులకు గాను 340 మార్కులు సాధించి బి గ్రేడ్‌ లో నిలిచారు.

ఎమ్మెల్యేకు పెయింటింగ్‌లో అత్యధికంగా 85 మార్కులు, ఇంగ్లిష్‌లో 44,హోమ్ సైన్స్ (83),ఒడియాలో 67,సాంఘిక శాస్త్రంలో 61 మార్కులు సాధించారు. కాగా..పూర్ణచంద్ర స్వయ్‌ సురడా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయంసాధించారు. కానీ ఆయన 10th Class ఫెయిల్.

కానీ ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు గెలుపొందినా ఆయనాలో 10th Class ఫెయిల్డ్ అనే భావన పోలేదు.దీంతో ప్రతీ సంవత్సరం 10th Class ఎగ్జామ్స్ రాసేవారు. రాసిన ప్రతీసారి ఆయన ఫెయిల్ అయ్యేవారు. అలా పట్టువదలని విక్రమార్కుడిలా 10th Class పాస్ అవ్వాలని ఒడిశా స్టేట్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా 10th Class పరీక్షలకు హాజరై ఎట్టకేలకు ఉత్తీర్ణత సాధించారు.

ఫిజుక్ మోడ్‌లో నిర్వహించిన పరీక్షలో పాల్గొన్న 15, 136 మంది విద్యార్థులలో బిజు జనతాదళ్ చట్టసభ సభ్యుడు పూర్ణ చంద్ర స్వైన్ కూడా ఒకరు. స్వైన్ ఆఫ్‌లైన్ స్టేట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ -2021 కోసం ఎస్‌బి హైస్కూల్, సూరడాలో కూర్చుని 68 శాతం మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.