సంచలన ప్రకటన చేసిన రాష్ట్రం : మూడు నెలలు ట్రాఫిక్ చలాన్లు ఉండవు

  • Publish Date - September 10, 2019 / 01:52 PM IST

మోటార్ వెహికల్ యాక్టు నిబంధనలు అమలు చేయడానికి టైం తీసుకోవాలని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధించిన టైంలో అన్ని పత్రాలు దగ్గర పెట్టుకోవాలని వాహనదారులకు సూచిస్తోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాక్ట్ తో వాహనదారులు భయపడిపోతున్నారు. వేలకు వేలు ఫైన్ లు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొన్ని రాష్ట్రాలు అమల్లోకి తీసుకరాలేదు. తాజాగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. 

మూడు నెలల పాటు నిబంధనలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పద్మనాభ బెహర ప్రకటించారు. ఈ కాలంలో వాహనాలకు సంబంధించిన పేపర్లు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఆయా పనుల నిమిత్తం కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్, పేరు మార్పు, తదితర వంటి సేవలను త్వరగా పొందే ఛాన్స్ ఉందని ప్రభుత్వం తెలిపింది.

Read More : ఆ రాష్ట్రంలో మాత్రమే : ట్రాఫిక్ జరిమానాలు సగం తగ్గించారు
కొత్త మోటార్ వెహికల్ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. భారీగా చలాన్లు విధిస్తుండడంపై వాహన దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. అక్కడక్కడ వాగ్వాదాలు, ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జరిమానాలు చెల్లించలేక కొంతమంది వెహికల్స్ ని అక్కడనే వదిలి వెళ్లిపోతున్నారు. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బిగ్ రిలీఫ్ దొరికిందని అనుకుంటున్నారు వాహనదారులు.