KIIT Student: ఇందుకే భారత విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు: ఓ విద్యార్థి ఆవేదనాభరిత వ్యాఖ్యలు
తల్లిదండ్రులు దాదాపు రూ.17.5 లక్షలు చెల్లించి ఇంజనీరింగ్ డిగ్రీ కోసం తమ పిల్లలను చేర్పిస్తారు.

@aaraynsh
KIIT Student: కొన్ని హాస్టళ్లలో విద్యార్థులు పడే తిప్పలు అన్నీఇన్నీ కాదు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో హాస్టల్ నిర్వాహకులకు ఉండే శ్రద్ధ వారికి అందించే భోజనంలో మాత్రం ఉండదు. అసలే నాసిరకం భోజనం పెడుతుంటారు. ఆపై అప్పుడప్పుడు భోజనంలో పురుగులు పడినా పట్టించుకోరు.
తాజాగా, ఒడిశాలోని కళింగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ-భువనేశ్వర్ కు చెందిన ఓ విద్యార్థి తమ హాస్టల్ భోజనంలో చచ్చిన కప్పను గుర్తించాడు. డబ్బులు తీసుకోవడంపై మన కాలేజీలకు ఉండే శ్రద్ధ మంచి సౌకర్యాలు అందించడంలో ఉండదని, అందుకే విదేశాలకు మన విద్యార్థులు వెళ్తున్నారని అన్నాడు.
కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యాన్ష్ తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్ లో వివరించాడు. ‘ఇది కేఐఐటీ భువనేశ్వర్. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కాలేజ్ ది 42వ ర్యాంక్. తల్లిదండ్రులు దాదాపు రూ.17.5 లక్షలు చెల్లించి ఇంజనీరింగ్ డిగ్రీ కోసం తమ పిల్లలను చేర్పిస్తారు.
అంత తీసుకుని కాలేజీ హాస్టల్‌లో ఇటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం దేశం నుంచి విద్యార్థులు విదేశాలకు ఎందుకు వలస వెళతారని మనం ఆశ్చర్యపోతుంటాం’ అని ఆర్యాన్ష్ ఆవేదన వ్యక్తం చేశాడు. భోజనం కప్ప కనపడిన ఫొటోను అతడు పోస్ట్ చేశాడు.
అతడు ఈ పోస్టు చేసిన కొన్ని గంటలకే కాలేజీ స్పందించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని కూడా ఆ విద్యార్థి పోస్ట్ చేశాడు. హాస్టల్ నిర్వాహకులకు ఇచ్చే ఒక్క రోజు చెల్లింపులను కట్ చేస్తున్నట్లు కాలేజీ సర్క్యూలర్ జారీ చేసినట్లు అందులో ఉంది. కేవలం ఒక్క రోజు పేమెంట్ ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని అన్నాడు.
This is KIT Bhubaneswar, ranked ~42 among engineering colleges in India, where parents pay approx 17.5 lakhs to get their child an engineering degree. This is the food being served at the college hostel.
Then we wonder why students from India migrate to other countries for… pic.twitter.com/QmPaz4mD82
— Aaraynsh (@aaraynsh) September 23, 2023
Kamal Haasan : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి