ఒడిశా: రెండు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి స్నేహ

  • Publish Date - January 9, 2020 / 10:13 AM IST

ఒడిశాలోని నందరంకనన్న జులాజికల్ పార్క్ లో ఉన్న తెల్లపులి స్నేహ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం (జనవరి 9,2020) తెల్లవారుఝామున 3.33 నుంచి 5.44 గంటలకు స్నేహ రెండు పిల్లల్ని కన్నది. ఈ రెండు పిల్లలతో కలిపి నందంకనన్ జూలో మొత్తం 27 పులులు ఉన్నాయి. 8 తెల్లపులులు, 13 సాధారణరంగు పులులు, మరో ెమలానిస్టిక్ పులులు..మరో రెండు నవజాత పులులతో కలిసి మొత్తం 27 పులులున్నాయని జూ అధికారులు తెలిపారు. 

ఈ పులిపిల్లలను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 105 రోజుల క్రితం సైఫ్ అనే సాధారణ పులి జతకట్టిన స్నేహ గురువారం రెండు పిల్లలకు జన్మనిచ్చిందని అవి ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. స్నేహ దాని పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటోందని తెలిపారు. జంతు మార్పిడి కోసం స్నేహను హైదరాబాద్ జూపార్క్ నుంచి నందంకనన్ పార్క్ కు తీసుకొచ్చామని జూ అధికారి సుసాంతానంద తెలిపారు.