Pune : రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీస్ .. ‘రిప్ హ్యుమానిటీ’ అంటూ స్పందించిన నెటిజన్లు

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్‌తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Pune

Pune : రైల్వే స్టేషన్లలో కొంతమంది ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లపై నిద్రిస్తుండటం మనం గమనిస్తూ ఉంటాము. అలా నిద్రిస్తున్న కొందరిపై పోలీసు అధికారి నీళ్లు పోశాడు. రూపేష్ చౌదరి అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘రిప్ హ్యుమానిటీ’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Up cop currency selfie : మంచం నిండా నోట్ల కట్టలు, కుటుంబంతో పోలీసు అధికారికి సెల్ఫీ.. ఆ తరువాత ఏమైందంటే..?

Rupen Chowdhury అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP)  ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపై బాటిల్‌తో నీటిని పోస్తున్నారు. నిద్రిస్తున్న వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నాడు. ఈ సంఘటన పూణే రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ‘రిప్ హ్యుమానిటీ’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు. ఇక ఈ ఘటన రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ఇందు దూబే ఈ ఘటనపై స్పందించారు. ఇలా జరగడం ‘తీవ్ర విచారం’ అని పేర్కొన్నారు. ‘ప్లాట్ ఫామ్ పై పడుకోవడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ పద్ధతిలో కౌన్సిలింగ్ చేయడం సరైన మార్గం కాదు.. ప్రయాణికుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది.’ అని శ్రీమతి దూబే తెలిపారు.

Kerala : రూ. కోటి లాటరీ గెలిచిన వ్యక్తికి పోలీస్ సెక్యురిటీ

ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియో చూసి ‘సిగ్గు చేటు’ అని.. ‘ఇలా ప్రవర్తించడం అమానుషం’ అని అభిప్రాయపడ్డారు. రైలు కోసం వేచి ఉన్న ప్రజల కోసం రైల్వే అధికారులు విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.