old lady dance video viral : సంతోషంగా డ్యాన్స్ చేసిన వృద్ధురాలు.. ఫిదా అవుతున్న జనం వీడియో వైరల్

సంతోషాలు, సరదాలు వయసుతో ముడిపడి ఉండవు.. ఏ పరిస్థితులు, పరిసరాలు కూడా అడ్డంకి కావు.. 80 ఏళ్ల బామ్మగారు ఎంతో ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపుతోంది.

old lady dance video viral

old lady dance video viral : ఎప్పుడూ సంతోషంగా ఉండటం.. ప్రతీ క్షణాన్ని సంతోషంగా గడపడం చాలామందికి సాధ్యం కాదు. ఏదో ఒక ఒత్తిడికి (stress) లోనవుతూ నిజంగా సంతోషంగా ఉండాల్సిన సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. ఇంకొంతమందిలో వయసు పెరిగే కొద్దీ ఉత్సాహం తగ్గిపోతుంది. ఇంక తమపనైపోయిందని దిగులు పడతారు. అలాంటి వారిని ఉత్తేజరుస్తోంది ఓ బామ్మగారు (elderly woman) . బహుశా 80 ఏళ్లు ఉండొచ్చు కాబోలు తనకి నచ్చిన పని చేయడానికి వయసు అడ్డింకి కాదనుకుంది. ఇష్టమైన మ్యూజిక్ వినగానే సంతోషంగా ఊగిపోతూ డ్యాన్స్ చేసింది. ఈ బామ్మ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. ఎందుకంటే?

పాలక్కాడ్ ఆలయంలో(Palakkad temple) ఏతనూర్ కుమ్మట్టి (Ethanur Kummatti) సంప్రదాయానికి సంబంధించి ఓ కార్యక్రమం మొదలైంది. ఇక్కడికి వచ్చిన 80 ఏళ్ల బామ్మ చాలా యాక్టివ్‌గా ఉంది. కార్యక్రమంలో సంగీతం మొదలు కాగానే బామ్మగారిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అక్కడ ఉన్నవారిని అస్సలు పట్టించుకోకుండా ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చేతులు తిప్పుతూ .. కాళ్లతో గెంతుతూ తనకు తోచిన విధంగా ఆ సంగీతానికి లయబద్ధంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇక కుర్చీలో కూర్చుని కూడా ఏ మాత్రం తగ్గలేదు. మళ్లీ లేచి రెట్టించిన ఉత్సాహంతో డ్యాన్స్ చేసింది. అంత పెద్దావిడ ఎలాంటి ఇబ్బంది పడకుండా సునాయాసంగా స్టెప్పులు వేయడం చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్యర్యపోయారు.

Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కి కొరియన్స్ డ్యాన్స్.. ప్రధాని మోదీ ట్వీట్..

ఈ వీడియో పలు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ కావడంతో Swati Jagdish అనే ఇన్‌స్టా యూజర్ తన అకౌంట్ లో పంచుకున్నారు. ఆమె డ్యాన్స్ చూస్తుంటే ఎంతో సంతోషం కలిగిందని ఆ వయసు వచ్చేసారికి తనకి కూడా అలా ఉండటం సాధ్యం కాదని స్వాతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉండటానికి సమయం, వయసు ఏది అడ్డు కాదని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుందని ఆమె షేర్ చేసుకున్నారు. ఇక ఈ బామ్మను ప్రేమిస్తున్నాను అని కొందరు.. ఈ వయసులో ఉన్న బామ్మలను అసలు వేదికల వద్దకే రానివ్వరని అలాంటిది ఆమె ఆలయ వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేయడం శుభ పరిణామం అని కొందరు అభిప్రాయపడ్డారు.