Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కి కొరియన్స్ డ్యాన్స్.. ప్రధాని మోదీ ట్వీట్..
నాటు నాటు సాంగ్ కి అన్ని దేశాల ప్రజలు ఫిదా అయిపోయారు. చరణ్, ఎన్టీఆర్ లాగే ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా కొరియాలో కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి కొరియన్, ఇండియన్ స్టాఫ్ కలిసి...............

Korean Embassy India staff perform naatu naatu song dance and PM modi praise their effort and the video goes viral
Naatu Naatu Song : RRR సినిమా గత సంవత్సర కాలంగా సాధిస్తున్న విజయాలు చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది RRR సినిమా. అన్ని దేశాల్లోనూ RRR సినిమాకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పలు అవార్డులు అందుకుంటూ బిజీగా ఉండి RRR యూనిట్. RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడమే కాక ఆస్కార్ నామినేషన్స్ లోను నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక నాటు నాటు సాంగ్ కి అన్ని దేశాల ప్రజలు ఫిదా అయిపోయారు. చరణ్, ఎన్టీఆర్ లాగే ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా కొరియాలో కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి కొరియన్, ఇండియన్ స్టాఫ్ కలిసి నాటు నాటు సాంగ్ కి చరణ్, ఎన్టీఆర్ లాగే స్టెప్పులు వేశారు. దాదాపు ఓ 50 మంది ఈ పాటకు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.
Manchu Manoj Marriage : మంచు వారింట పెళ్లి పనులు.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఆ రోజేనా?
దీంతో ఈ వీడియోని కొరియన్ ఎంబసీ ఇండియా తమ అధికారిక పేజీలో షేర్ చేసి.. కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి కొరియన్, ఇండియన్ స్టాఫ్ కలిసి నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ చేశారు, దీన్ని షేర్ చేయడం మాకు ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశారు. ఈ వీడియోని ప్రధాని నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి.. చాలా కష్టపడి అద్భుతంగా చేశారు అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.
Lively and adorable team effort. ? https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023