క్వారంటైన్ టిప్స్ కావాలంటే చెప్తా…విడుదల తర్వాత ఒమర్ అబ్దుల్లా ట్వీట్

నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లానే కశ్మీర్ కూడా లాక్ డౌన్ లో ఉంది. 

23రోజుల తర్వాత నిర్భందం నుంచి విడుదలై చివరకు హరి నావాస్ వదిలిపెట్టాను. ఆగస్టు-5,2019న ఉన్నదానికంటే ఇవాళ ఇది చాలా ప్రత్యేకమైన ప్రపంచం అని విడుదల అనంతరం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు. మార్చి-10న 50వ వసంతంలోకి అడుగుపెట్టిన అబ్దుల్లా…ఇవాళ ఇప్పటివరకు నిర్భందంలో ఉన్న శ్రీనగర్ లోని హరి నివాస్ నుంచి దగ్గర్లోని తన అధికారిక ఇంటికి వెళ్లారు.

అయితే గంలో ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ప్రజలకు కనిపించే ఒమర్ అబ్దుల్లా..ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్ల గడ్డం గుబురుగా పెరిగిపోయింది. తన నిరసనకు గుర్తుగా తాను విడుదలయ్యేంతవరకు గడ్డం తీయబోనని ఒమర్ తీర్మాణించుకున్న విషయం తెలిసిందే. అయితే తనతో పాటు అరెస్ట్ చేసిన మాజీ సీఎం,పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీని కూడా విడుదల చేయాలని ఒమర్ విజ్ణప్తి చేశారు. ఇటీవల ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

విడుల అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి ఒమర్ ప్రస్తావించారు. ఇవాళ మనమంతా చావుబ్రతుకు యుద్ధం చేస్తున్నామని నేను రియలైజ్ అయ్యాను అని ఒమర్ అన్నారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో అదుపులోకి తీసుకున్నవాళ్లందరినీ ఇవాళ విడుదల చేయాలన్నారు. కరోనా పోరాటంలో భారత ప్రభుత్వ సూచనలను అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ఒమర్ ప్రజలకు విజ్ణప్తి చేశాడు. అయితే ఎవరికైనా క్వారంటైన్ సమయంలో బతకడం గురించి లేదా లాక్ డౌన్ అవ్వడం గురించి చిట్కాలు కావాలనుకుంటే నతన వద్ద నెలల అనుభవం ఉందని ఒమర్ చేసిన ట్వీట్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒమర్ ట్వీట్ చేసిన 15నిమిషాల్లోనే 1000రీట్వీట్లు,5వేల లైక్ లు వచ్చాయి.

See Also |  ప్రపంచమంతా లాక్ డౌన్…వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత!