హస్ అరెస్టులో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపించినట్లు బీజేపీ శ్రేణులు ట్వీట్ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాషాయ శ్రేణులు ఒమర్ అబ్దుల్లా ఫొటోను చూసి సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే..ఆయన గుబురు గడ్డంతో ఉన్న ఆయన న్యూ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అబ్దుల్లాతో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారంతా స్వేచ్చగా తిరుగుతుంటే..ఆయన మాత్రం ఇంటికే పరిమితం కావడం బాధాకరమని ఎద్దేవా చేస్తున్నారు.
అందుకోసం తాము అమెజాన్ నుంచి షేవింగ్ రేజర్‌ను అబ్దల్లా విలాసానికి బుక్ చేయడం జరిగిందని, దయచేసి దీనిని తీసుకోవాలని..ఏదైనా అవసరం ఉంటే..మాత్రం కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే..కొద్ది సమయం తర్వాత ట్విట్టర్‌లో ఆ ట్వీట్ కనిపించ లేదు.
ఒమర్ అబ్దుల్లా ఫొటో చూసి చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ముఖంలో వృద్దాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్నెళ్లుగా ఆయన నిర్బంధంలో ఉన్నా..ఆ ఫోటోని చూస్తుంటే 30 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.
Read More : కరోనా వైరస్ : ఆ బీర్ సేల్స్ ఢమాల్..ఎందుకు ?
2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు.
कश्मीर से धारा 370 35a हटाया था ..उस्तरा (Razor) नहीं ?? https://t.co/q9tDgMCbeh
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) January 27, 2020