Omicron (4)
Omicron variant fastly Spread : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇండియాలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 38 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఒక్కరోజే 5 కేసులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. మరో మూడు కేసులు మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో వెలుగుచూశాయి. ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 18 మందికి ఈ కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతోండటం ఆందోళనకర పరిణామం. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. కొత్త వేరియంట్ ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తోందోనని జనం భయపడుతున్నారు. సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కలవరపెడుతోంది. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి గాడిన పడుతోంది. లాక్‌డౌన్‌లతో నష్టపోయిన అన్ని వర్గాలూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ఓమిక్రాన్ కేసులు పెరుగడం అందరినీ ఆందోళకు గురి చేస్తోంది.
Auto Accident : నెల్లూరు జిల్లా బీరాపేరు వాగులో ఆటో పడిన ఘటన..ముగ్గురి మృతదేహాలు లభ్యం
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. వాటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. మరో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతంగా నమోదైనట్టు తేలింది. దీంతో కట్టడి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆయా రాష్ట్రాలను కోరింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించింది. కేంద్రం లేఖ రాయకముందే కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో 114 సెక్షన్ విధించింది. ఆ నగరానికి అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కువగా వస్తున్నారు. విమానాశ్రయాల్లో చేస్తున్న టెస్టుల్లో కొందరికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. జీనోన్ సీక్వెన్స్‌లో కొన్ని ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి . ఈనెలలో విదేశాల నుంచి ముంబై, పుణె, నాగ్‌పూర్ ఎయిర్ పోర్టుల 61 వేల మందికి పైగా వచ్చారు. వారిలో దాదాపు 10 వేల మంది ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన వారేని గుర్తించారు. సెకండ్ వేవ్ సమయంలోనూ.. ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య
పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో టెస్ట్‌లు, వ్యాక్సినేషన్ పెంచాల్సిన అవసరాన్ని కేంద్రం సూచించింది. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించాలని చెప్పింది. జన సమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని సూచించింది. దేశం మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్తే జీవన విధ్వంసం తప్పదన్న భయంతో ప్రజలు ఉన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఇదే జరిగింది. వాటిని గుర్తు చేసుకుని ప్రజలు భయపడుతున్నారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.