Auto Accident : నెల్లూరు జిల్లా బీరాపేరు వాగులో ఆటో పడిన ఘటన..ముగ్గురి మృతదేహాలు లభ్యం

నెల్లూరు జిల్లాలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

Auto Accident : నెల్లూరు జిల్లా బీరాపేరు వాగులో ఆటో పడిన ఘటన..ముగ్గురి మృతదేహాలు లభ్యం

Auto Accident

Three dead bodies found : నెల్లూరు జిల్లాలో సంగం సమీపంలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు బయపటపడ్డాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మూడు రోజులుగా సాగిస్తున్న గాలింపులో కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు, కర్రా పద్మ మృత దేహాలను వెలికితీశాయి. మిగిలిన ఇద్దరు కర్రా సంపూర్ణ, దివనపు ఆదెమ్మ ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

గాలింపులో లభించిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాలుగు రోజులు నీటిలో ఉండంతో బాడీలు పూర్తిగా కుళ్లిపోయాయి. కటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దూరం నుంచే కడసారిగా చూస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మిగిలిన ఇద్దరు కర్రా సంపూర్ణ, దివనపు ఆదెమ్మ కోసం కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కడసారి చూపైనా దక్కితే చాలనుకుంటున్నారు.

Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

ఈ నెల 9న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి సంగం శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. వారిలో కర్రా నాగవల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాలింపులో కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు, కర్రా పద్మ మృత దేహాలు బయటపడ్డాయి. కర్రా సంపూర్ణ, దివనపు ఆదెమ్మ ఆచూకీ లభించాల్సి ఉంది.