Independence Day 2023
Independence Day 2023 : ఆగస్టు 15 అంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఆ రోజు స్కూల్లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సంబరంగా పాల్గొంటారు. కొన్ని స్కూళ్లలో, కాలేజీల్లో స్టూడెంట్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. అనేక పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. కొన్ని ఐడియాలు మీ కోసం.
Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు
బ్రిటీషు వారి పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది స్వేచ్ఛా దేశంగా భారత దేశం అవతరించిన రోజు ఆగస్టు 15. ఈరోజు పేద, ధనిక అనే బేధం లేకుండా గర్వంగా దేశ భక్తితో వేడుకలు జరుపుకుంటాం. స్కూళ్లు, కాలేజీలు కూడా ప్రతి సంవత్సరం అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. విద్యార్ధులకు దేశం పట్ల ప్రేమ, భక్తి, అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చును.
భారత దేశానికి సులువుగా స్వాతంత్ర్యం రాలేదు. అందుకోసం ఎలాంటి పోరాటాలు జరిగాయో? తెలిపేలా కొన్ని అంశాలను తీసుకుని పిల్లలతో నాటకాలు వేయించవచ్చును. ఇలా చేయడం ద్వారా భారత దేశం స్వతంత్ర దేశంగా ఏర్పడం వెనుక స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం, అప్పటి పరిస్థితుల పట్ల అవగాహన ఏర్పడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం భారతీయ సంప్రదాయాన్ని ప్రదర్శించడానికి సరైన రోజు. విద్యార్దులతో బృందాలుగా సాంస్కృతిక నృత్య ప్రదర్శ నలు ఇప్పిస్తే వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.
Tricolour Food Recipes : ఆగస్టు 15 న త్రివర్ణంలో ఈ వంటకాలు ట్రై చేయండి
స్కూళ్లలో ఫ్లాగ్ రిలే రేస్ వంటి పోటీలు పెట్టవచ్చు. ఎవరు జెండాను ముందుగా తీసుకెళ్లి రేసులో గెలుస్తారో వారికి బహుమతులు ఇవ్వొచ్చు. టీ షర్ట్ పెయింటింగ్, డిజైనింగ్ పోటీలు నిర్వహించవచ్చును. తెల్లటి చొక్కాలు ఇచ్చి రంగులతో వారిని పెయింట్ చేయమని చెప్పొచ్చు. త్రివర్ణంలో వారికి వచ్చిన ఐడియాలతో డిజైన్ గీసే అవకాశం ఉంటుంది. చారిత్రక ప్రదేశానికి స్టూడెంట్స్‌ను పిక్నిక్ తీసుకెళ్లచ్చు. అవి కుతుబ్ మినార్, ఎర్రకోట, ఇండియా గేట్ ఏదైనా కావచ్చు. ఆ ప్రదేశాల్లో జరిగిన చారిత్రక అంశాలను వారికి బోధించవచ్చును.
దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించవచ్చును. ఇవి వారికి ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుతాయి. రంగోలీ లేదా క్లాసు అలంకరణ పోటీలు కూడా నిర్వహించవచ్చును. డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం, స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసే వస్త్రధారణ పోటీలు, ఇండిపెండెన్స్ డే క్విజ్ వంటి పోటీలు నిర్వహించవచ్చును. స్వాతంత్ర్య సమరయోధుల స్టోరీలపై వ్యాసరచన పోటీలు, త్రివర్ణంలో క్యాండిల్స్ తయారీ, ఇంట్లో వస్తువులతో జెండా తయారు చేయడం, క్లాస్ రూంని చార్టులు, బొమ్మలతో అలకరించడం వంటి పోటీలు ఇవి వారిలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకువస్తాయి. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సంవత్సరాలు ఈ వేడుకలకు చిన్నారులంతా దూరమయ్యారు. మళ్లీ వారిలో కొత్త ఉత్సాహాన్ని ఉరకలు వేయించాలన్నా, వారిలోని క్రియేటివిటీని బయటకు తీసుకురావాలన్నా ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయి.