Tricolour Food Recipes : ఆగస్టు 15 న త్రివర్ణంలో ఈ వంటకాలు ట్రై చేయండి
ఆగస్టు 15 యావత్ భారత దేశానికి వేడుక. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకుంటాం. అలాంటి ప్రత్యేకమైన రోజు వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? నేచురల్ కలర్స్‌తో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు.

Tricolour Food Recipes
Tricolour Food Recipes : ఆగస్టు 15 న వాడ వాడలా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటాం. జాతీయ జెండాను ఎగరవేసి దేశ భక్తిని చాటుకుంటాం. దేశ భక్తి గీతాలు ఆలపిస్తాం. ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈరోజున వంటకాలు కూడా ప్రత్యేకంగా చేసుకుంటే.. అదీ త్రివర్ణంలో మనం తినే ఆహారాన్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? కొన్ని ఐడియాలు మీకోసం.
శాండ్ విచ్
ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా చాలా ఈజీగా ఆరోగ్యకరమైన , రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టపడే ఫుడ్ శాండివిచ్. పుదీన పనీర్ ఆకుపచ్చ పొర, క్రీమీ క్యారెట్ నారింజ పొరతో దీనిని తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి కలర్ కూడా సరిపోతాయి.
పాస్తా సలాడ్
పాస్తా రుచికరమైనదేకాకుండా ఈ వేడుకల్లో తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. మరినారా సాస్, అల్ఫ్రెడో సాస్, పేస్టోసాస్ మూడు రంగులు మూడు లేయర్లతో రెడీ చేసుకోవచ్చు. సమ్మర్ పార్టీలు, వీకెండ్ గెట్ టుగెదర్ లలో కూడా దీనిని తినడానికి చాలామంది ఇష్టపడతారు.
తిరంగ ధోక్లా
మూడురంగుల ధోక్లా.. ఇడ్లీ పిండి, పాలక్ పూరీ, అల్లం పేస్ట్‌తో ఆగస్టు 15 వేడుకలో అద్భుతంగా తయారు చేసుకునే వంటకం. జెండాలోని మూడు రంగులు ఈ ఫుడ్‌లో రుచులను పంచుతాయి.
కబాబ్
ట్రై కలర్ చికెన్ కబాబ్ కాజు ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్, టొమేటో ఫ్లేవర్ కలయికతో అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు ఫుడ్ తినాలి అనేవారిని ఇది నోరూరిస్తుంది.
Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి
పులావ్
ఇక పులావ్ అంటే ఇష్టపడని వారుంటారా? అదీ ఇలాంటి ప్రత్యేకమైన రోజున తినడానికి మరింత ఇష్టపడతారు. రుచికరమైన పోషకమైన ట్రై కలర్ రైస్ తయారు చేయడం సులభం. బచ్చలికూర నేచురల్ ఆకుపచ్చ రంగు కోసం, కొబ్బరిపాలు తెలుపు రంగు, టమాటాలు సహజ నారింజ రంగు కోసం ట్రై కలర్ పులావ్‌లో వాడండి.
ట్రై కలర్ కుల్ఫీ
కుల్ఫీ అంటే అందరికీ ఇష్టమే. ట్రై కలర్ కుల్ఫీ పాలు, చక్కెర, యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, బాదం, పిస్తా గింజలు వంటి రుచులతో తయారు చేస్తారు. రెగ్యులర్ రుచికి భిన్నంగా ఉండటంతో పాటు ట్రై కలర్ కుల్ఫీ తయారు చేయడం కూడా చాలా సులభం. ఇంకా ఇడ్లీ, పరాఠాలు, వెజ్ సబ్జీ, దోస, లడ్డూ, సలాడ్, కాక్ టైల్ వంటివి త్రివర్ణంలో తయారు చేయడానికి ప్రయత్నించండి. ఇలా స్వాతంత్ర్య దినోత్సవం రోజు త్రివర్ణంలో దొరికే ఆకుకూరలు, కూరగాయలతో మీకు వచ్చిన మీరు మెచ్చిన వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసుకోండి. భిన్నంగా సంబరాలు జరుపుకోండి.