Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మువ్వన్నెల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేస్తాం. మన జాతీయ జెండాను ఎగరేసేటపుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి.

Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

Flag of India

Flag of India : బ్రిటీష్ రాక్షస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించి ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరింది. ఏటా ఆగస్టు 15 న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయులను మనసారా తలుచుకుంటాం. మువ్వన్నెల జెండా ఎగరేసి భారత జాతి ఔన్నత్యాన్ని చాటుకుంటాం. మన జాతీయ జెండాలోని రంగులు .. అసలు జెండా ఎగరవేసేటపుడు పాటించాల్సిన నియమాలు ఓసారి తెలుసుకుందాం.

Inspirational Story : భార్యకి చీర కొంటూ మిల్లు యజమానికి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పారో తెలుసా!

పింగళి వెంకయ్య మన జాతీయ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం రంగు దేశ పటిష్టత, ధైర్యానికి ప్రతీక. మధ్యలో ఉండే తెలుపు శాంతికి చిహ్నం. కింద ఉండే ఆకుపచ్చ దేశ ప్రగతిని సూచిస్తుంది. మధ్యలో 24 ఆకులతో నీలం రంగులో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది.  1947 జూలై 27 న రాజ్యాంగ సభ ఆమోదించిన తర్వాత నుంచి మనం జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం.

జాతీయ జెండా ఖాదీ, కాటన్, సిల్క్‌తో మాత్రమే తయారు చేయాలి. పొడవు, వెడల్పులు ఖచ్చితంగా 2:3 నిష్సత్తిలో ఉండాలి. 6300X4200 మిల్లీ మీటర్ల నుంచి 150X100 మిల్లి మీటర్ల వరకూ 9 రకాల సైజుల్లో జాతీయ జెండాను తయారు చేసుకోవచ్చు.

Independence Day 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగస్టు 1947 మంచి రోజు కాదట .. కానీ భారత్‌కు స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారు?

జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ  పై నుంచి కిందకు వచ్చేలా ఎగరవేయాలి. జెండా కిందకు వంచకూడదు. నిటారుగా ఉండాలి. ప్లాస్టిక్‌తో జెండాలు తయారు చేయకూడదు. కాగితంతో జెండాలు చేసుకోవచ్చును అవి చిన్న సైజ్ జెండాలు అయి ఉండాలి. జెండాలో తెలుపురంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులు కలిగి నీలం రంగులో ఉండాలి. జాతీయ జెండాను సూర్యోదయం తరువాత ఎగరేయాలి. అస్తమించకముందు జెండాను దించాలి. ఇతర జెండాలతో జాతీయ జెండాను ఎగురవేస్తే మిగిలిన జెండాల కంటే జాతీయ జెండా ఎత్తులో ఉండాలి. ఇలాంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి.