Infant Deaths : పుట్టిన ప్రతి 36 మంది శిశువుల్లో ఏడాదిలోనే మరణిస్తున్నారు : రిపోర్టు

Infant Deaths : దేశంలో శిశు మరణాల రేటు పెరుగుతోంది. పుట్టిన శిశువులు ఏడాదిలోపే మృత్యువాతపడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో శిశు మరణాల రేటు తగ్గుతున్నాయి.

One In Every 36 Infants Still Dies Before First Birthday In India Data

Infant Deaths : దేశంలో శిశు మరణాల రేటు పెరుగుతోంది. పుట్టిన శిశువులు ఏడాదిలోపే మృత్యువాతపడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశంలో శిశు మరణాల రేటు తగ్గుతున్నాయి. కానీ పుట్టిన 36 మంది శిశువుల్లో ఒక శిశువు ఏడాదిలోపే మ‌ర‌ణిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ డేటా పేర్కొంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా లేటెస్టుగా ఐఎంఆర్ డేటాను రిలీజ్ చేసింది. వెయ్యి మంది శిశువుల్లో పుట్టిన‌ ఏడాది లోపు చ‌నిపోతే అప్పుడు శిశు మ‌ర‌ణ రేటుగా పరిగణిస్తారు. రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా తాజాగా Infant Mortality Rate (IMR) డేటాను రిలీజ్ చేసింది. 2020 ఏడాదిలో పుట్టిన ప్ర‌తి వెయ్యి మంది పిల్ల‌ల్లో 28 మంది శిశువులు ఏడాదిలోపే మరణించారని నివేదికలో తేలింది.

1971లోని శిశువు మరణాల రేటు డేటాతో పోలిస్తే.. నాలుగింత‌లు త‌క్కువేనని నిర్ధారించారు. 1971లో శిశు మ‌ర‌ణ రేటు 129గా ఉండగా.. పదేళ్ల కాలంలో IMR 36 శాతం త‌గ్గిన‌ట్లు డేటాలో గుర్తించారు. శిశు మ‌ర‌ణ రేటు త‌గ్గినా 36 మంది శిశువుల్లో ఒక శిశువు ఏడాది లోపే చ‌నిపోతున్న‌ట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. 2020లో అత్య‌ధిక శిశు మ‌ర‌ణాల రేటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో న‌మోదు అయ్యింది.

One In Every 36 Infants Still Dies Before First Birthday In India Data 

ఆ రాష్ట్రంలో ఐఎంఆర్ 43గా ఉంది. మీజోర‌మ్‌లో క‌నిష్టంగా 3 శాతంగా ఉండగా జ‌న‌న రేటు త‌గ్గింది. 1971లో 36.9గా నమోదైన జ‌న‌న రేటు 2020లో 19.5గా ఉంది. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల మ‌ధ్య జ‌న‌న రేటులో వ్య‌తాసం త‌గ్గింది. గ‌డిచిన 5 దశబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే జ‌న‌న రేటు అధికంగా ఉంది. 2011లో జ‌న‌న రేటు 21.8గా నమోదైంది.. 2020లో 19.5గా నమోదైంది. దశాబ్ద కాలంలో జ‌న‌న రేటు 11 శాతానికి క్షీణించింది.

Read Also : ‘Unsafe Hospital’ :ఆ హాస్పిటల్లో ప్రతీరోజూ 37మం‍ది పసిగుడ్డులు మృతి..దేశ శిశు మరణాలలో 13 శాతం ఇక్కడే..