Bengaluru Traffic Police Representative Image (Image Credit To Original Source)
Bengaluru: కారు సైలెన్సర్ లో మార్పులు చేసి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఓ విద్యార్థికి ట్రాఫిక్ పోలీసులు బాగా బుద్ధి చెప్పారు. అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఏకంగా లక్ష రూపాయల 11వేల 500 రూపాయల ఫైన్ వేశారు. ఇందులో మరింత షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కారు విలువ 70 వేల రూపాయలే.
కర్నాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. కారు సైలెన్సర్ లో మార్పులు చేసి వాహనదారులను భయాందోళనకు గురి చేసిన విద్యార్థి పట్ల హెన్నూర్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కేరళకు చెందిన విద్యార్థి 70వేలు పెట్టి కారు కొన్నాడు. ఆ కారు సైలెన్సర్ లో మార్పులు చేయించాడు. దాని నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పాటు నిప్పు రవ్వలు వచ్చేలా సైలెన్సర్ ని మోడిఫై చేయించాడు.
జనవరి 2న భారతీయ సిటీ సమీపంలోని హెన్నూర్ రోడ్డులో కారు నడిపాడు. ఆ సమయంలో వాహనం నుండి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. నిప్పు రవ్వలు కూడా కనిపించాయి. దీంతో తోటి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ శబ్దాలకు, నిప్పు రవ్వలకు బెంబేలెత్తిపోయారు. రోడ్డుపై వెళ్లే వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోటి వాహనదారులు ఇదంతా వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మ్యాటర్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడని తేలడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కారుని ట్రేస్ చేసి సీజ్ చేశారు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ వ్యవహరించారు. విద్యార్థిపై కేసు నమోదు చేయడానికి బదులుగా.. ఉల్లంఘనను ప్రాంతీయ రవాణా కార్యాలయానికి (RTO) సూచించారు.
ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో RTO అధికారులు రంగంలోకి దిగారు. కారుని పరిశీలించారు. చట్టవిరుద్ధంగా మోడిపై చేసిన సైలెన్సర్ ఉందని నిర్ధారించారు. ఇది అధిక శబ్దం చేయడమే కాకుండా ఇతర వాహనదారుల్లో భయాందోళనలను సృష్టించే నిప్పురవ్వలను కూడా విడుదల చేయడం గమనించారు. “ఈ మోడిఫికేషన్ మోటార్ వాహనాల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇది తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది” అని అధికారులు తెలిపారు. RTO అధికారులు యాక్షన్ తీసుకున్నారు. గరిష్టంగా ఒక లక్ష 11వేల 500 రూపాయల జరిమానా విధించారు. ఈ ఫైన్ ని విద్యార్థి చెల్లించాడు. దాంతో అధికారులు వాహనాన్ని విడుదల చేశారు.
కాగా, కారుపై ఫైన్ విధించకుండా వదిలేయాలని అనేక మంది రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కానీ, పోలీసులు వెనక్కి తగ్గలేదు. “వాహనాల సైలెన్సర్‌లను సవరించే వారికి, ట్టాన్ని ఉల్లంఘించే వారికి ఇది ఒక పాఠం. బెంగళూరు పోలీసులు ఇటువంటి ఉల్లంఘనలను ఏమాత్రం సహించరు” అని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.
Bengaluru: Modified silencer leads to Rs 1.11 lakh fine on car worth Rs 70,000. @Hennurutrps1234 said that instead of registering a case, the traffic police referred the violation to the RTO Yelahanka@BlrCityPolice@blrcitytraffic
Read more at: https://t.co/dsDl8awYJk pic.twitter.com/vbm5RaAUnU— Manju Shettar (@ManjuShettar) January 15, 2026