Madhya Pradesh: మధ్యప్రదేశ్‭లో మరో మూత్రవిసర్జన ఘటన.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్రం పోసి లేపి కొట్టారు

కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్‌ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు.

Urination Case: మధ్యప్రదేశ్‌లో మరోసారి సిద్ధి లాంటి మూత్ర విసర్జన దుర్ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులైన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు గ్రామపెద్ద భర్త. అంతేకాకుండా ఆయన బీజేపీ ఎమ్మెల్యేకు సహచరుడు కూడా. విషయం ఏంటంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు వెళ్లిన రౌడీలను ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. అయితే అతడిని రౌడీలు దారుణంగా కొట్టారు. బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం అతనిపై మూత్ర విసర్జన చేసి స్పృహలోకి తీసుకువచ్చి, ఆపై మళ్లీ కొట్టారు.

Rishi Sunak: ఇండియా పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లగానే కష్టాలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సుఖీ సేవనియా ప్రాంతంలో జరిగిందీ దారుణం. సమాచారం మేరకు బాధితుడైన రాంస్వరూప్ అహిర్వార్ దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. చౌపడకలాన్ గ్రామపంచాయతీలో కొత్వార్(వాచ్‌మెన్)గా పనిచేస్తున్నాడు. బాధితుడు ఈ దారుణానికి సంబంధించిన వివరాలను పోలీసులకు వివరించాడు.

Parliament Staff New Dress : కమలం పువ్వుతో పార్లమెంట్ సిబ్బందికి కొత్త డ్రెస్ .. కాషాయీకరణ అంటూ విమర్శలు

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 10న ఈ ఘటన జరిగింది. భోపాల్‌లోని ఓ గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న రౌడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. గ్రామపెద్ద భర్త షేరు మీనాతో పాటు కొందరు రౌడీలు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రౌడీలను అడ్డుకోవడంతో దాడికి పాల్పడ్డారని తెలిపాడు. నిందితులు తనను తమ కారులో బలవంతంగా తీసుకెళ్లి నిర్జన ప్రాంతంలో దారుణంగా కొట్టారని, అపస్మారక స్థితిలో ఉన్న తనపై మూత్రం పోసి లేపి మరీ కొట్టారని పేర్కొన్నాడు.

UP Roadways: 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు ఉంటే బస్సు కదలదు.. ఆర్టీసీ కొత్త నిర్ణయం

కొట్టడం, మూత్రవిసర్జన సంఘటన తర్వాత, నిందితులు రామ్ స్వరూప్‌ను షేరు మీనా ఇంటికి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారట. నిందితుల్లో ఉన్న షేరు మీనా అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మకు సన్నిహితుడు. మరోవైపు, ఫిర్యాదు ఆధారంగా 7 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రమోద్ కుమార్ సిన్హా తెలిపారు. 7 మంది నిందితులలో 5 మందిని అరెస్టు చేశామని, మిగతావారిని కూడా పట్టుకుంటామని తెలిపారు.