‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర పడకపోవచ్చు: దిగ్విజయ్ సింగ్

బిల్‌ను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

One Nation One Election: జమిలి ఎన్నికల బిల్‌ను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానికి చైర్‌పర్సన్‌గా బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరిని కూడా నియమించింది.

అయితే, ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర పడకపోవచ్చని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. “జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందని నేను భావించడం లేదు” అని అన్నారు.

కాగా, గురువారం పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌ గాయపడిన తర్వాత రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు మేరకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కూడా దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు.

బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. బీజేపీ నేతల మధ్యే తోపులాట జరిగిందని తెలిపారు. ఒక బీజేపీ ఎంపీ మరొకరిపై పడ్డారని, ఇద్దరికి గాయాలయ్యాయని చెప్పారు. రాహుల్ గాంధీ తన ముందు నిలబడి ఉన్నాడని పడిపోయిన వ్యక్తి చెప్పాడు. మరి ఆ బీజేపీ ఎంపీని రాహుల్‌ గాంధీ ఎలా నెట్టగలరని ప్రశ్నించారు.

Shyamala Rao: టీటీడీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: టీటీడీ ఈవో జే శ్యామలరావు