Shyamala Rao: టీటీడీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: టీటీడీ ఈవో జే శ్యామలరావు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని అన్నారు.

Shyamala Rao: టీటీడీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం: టీటీడీ ఈవో జే శ్యామలరావు

TTD EO Shyamala Rao

Updated On : December 22, 2024 / 4:11 PM IST

టీటీడీలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ ఈవో జే శ్యామలరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచన మేరకు సామాన్య భక్తుల సౌకర్యాలపై అధికంగా దృష్టిపెట్టామని తెలిపారు.

తిరుమల దివ్య క్షేత్రం పవిత్రత కాపాడడంతో పాటు పవిత్రతను పెంపొందించే దిశగా చర్యలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు.. వెళ్లిన తర్వాత టీటీడీ సేవలు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని అన్నారు. తిరుమలలో పారిశుధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని చెప్పారు. తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు సొంత కంపెనీలు పేర్లు పెట్టుకోవడం నిషేధమని తెలిపారు.

తిరుమలలో 45 అతిథి గృహాల పేర్లు మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అతిథి గృహాల పేర్లు ఆధ్యాత్మికత, భక్తిభావం కనిపించేలా ఉండాలని వివరించారు. టీటీడీ కొన్ని పేర్లను ఎంపిక చేసి దాతలకు ఇస్తుందని అన్నారు. ఆ పేర్లను దాతలు ఎంపిక చేసుకోవాలని అన్నారు. తిరుమలకు వాహనాలు అధికంగా వస్తున్నాయని, వాహనాల సంఖ్యను తగ్గించే విధంగా ఆలోచన చేస్తామని చెప్పారు.

Pawan Kalyan : డప్పు కొట్టి గిరిజనులతో కలిసి థింసా డ్యాన్స్ చేసిన పవన్.. పాట కూడా నేర్చుకొని.. ఫొటోలు, వీడియోలు వైరల్..