ఒక్క కరోనా.. కోటి బుల్లెట్లతో సమానం.. వైరస్‌తో మారణహోమానికి ఉగ్రవాదుల ప్లాన్

  • Publish Date - April 12, 2020 / 12:44 PM IST

భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు కరోనాను అస్త్రంగా మార్చుకుంది పాకిస్థాన్‌. వైరస్‌ను వాడుకుని మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్‌ చేశారు. నేపాల్‌లో దాక్కున్న టెర్రరిస్టులు బిహార్‌ మీదుగా దేశంపైకి దండెత్తేందుకు సిద్ధమయ్యారని సశస్త్ర సీమా బల్‌ గుర్తించడంతో కలకలం రేగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న అతిపెద్ద బాంబ్.. కరోనా. కంటికి కనిపించకుండా ప్రపంచం మొత్తం ఉచ్చు బిగించిన కరోనా వైరస్.. ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో ప్రధాన అస్త్రంగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాంబులు, బుల్లెట్లతో సాధించలేని దాన్ని.. వైరస్‌తో దక్కించుకోవాలని పెద్దపెద్ద ఉగ్రవాద సంస్థలన్నీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ.. మనల్ని ఎలాగైనా దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ల మీద ప్లాన్లు గీసే పాక్‌ ఉగ్రవాదులు.. ఇప్పుడు కరోనాను అంటించుకుని మన దేశంపైకి దండెత్తడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు.. కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి జాలిమ్‌ ముఖియాను సూత్రధారిగా భావిస్తున్నారు. నేపాల్ నుంచి.. బీహార్ సరిహద్దుల మీదుగా దేశంలోకి ఈ కరోనా టెర్రరిస్టులు చొరబడడానికి సిద్ధంగా ఉన్నారంటూ.. సశస్త్ర సీమా బల్.. తమ ఉన్నతాధికారులకు రాసిన ఓ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. నేపాల్‌లోని ఓ మసీదులో దాదాపు 200 మంది ఉగ్రవాదులు నక్కారని తెలుస్తోంది. పాక్‌ ఐఎస్‌ఐ నుంచి ట్రైనింగ్ తీసుకున్న వీరంతా.. కరోనాతో బాధపడుతున్నారట. వీరికి పారాసిటమల్ టాబ్లెట్‌ వేసి.. టెంపరేచర్ తగ్గించి.. బీహార్ సరిహద్దుల దగ్గర దాటించేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన SSB జవాన్లు.. వెంటనే ఉన్నతాధికారులకు, కేంద్ర హోంశాఖకు సమాచారం అందించారు. దీంతో.. బీహార్‌-నేపాల్‌ బోర్డర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నేపాల్‌ నుంచి చీమను కూడా దేశంలోకి అడుగు పెట్టనివ్వొద్దంటూ ఆర్డర్ పాస్ చేశారు.

ప్రపంచ దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తోంటే.. పాకిస్థాన్‌ మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా తన కుట్రల్ని కంటిన్యూ చేస్తున్న విషయం.. ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది. గత పది రోజులుగా కశ్మీర్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులకు భారత సైన్యం చెక్ పెట్టింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో.. ఉగ్రవాదుల పాచిక పారడం లేదు. దీంతో.. బాంబులు, బుల్లెట్లతో సాధించలేకపోయిన దాన్ని.. వైరస్‌తో సాధించడంలో భాగంగా ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది.