Bhagwant Mann: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కారు.. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందన్న పంజాబ్ సీఎం

పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.

Bhagwant Mann: పంజాబ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. సభలో భగవంత్ మన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Ashwini Vaishnaw: 200 రైల్వే స్టేషన్లకు ఆధునిక వసతులు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

మరోవైపు విశ్వాస పరీక్ష సందర్భంగా సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీలో విజయం అనంతరం సీఎం భగవంత్ మన్ మాట్లాడారు. ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని వ్యాఖ్యానించారు. సభలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీకి మద్దతుగా ఎమ్మెల్యేలు చేతులు ఎత్తాలని కోరారు. ఈ చర్చ ప్రారంభమైన వెంటనే సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. సభలో మొత్తం 91 మంది ఆప్ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. సభలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆమ్ ఆద్మీకి అనుకూలంగా చేతులు ఎత్తి ఓటింగులో పాల్గొన్నారు.

Online Betting Ads: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం… నిషేధం విధిస్తూ నిర్ణయం

దీంతో ఆప్ 93 ఓట్లతో విజయం సాధించింది. దీంతో విశ్వాస పరీక్షలో ఆప్ నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీకి 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో స్పీకర్ ఒకరు. కాంగ్రెస్ పార్టీకి 18 మంది, శిరోమణి అకాలీ దళ్ పార్టీకి ముగ్గురు, బీజేపీకి ఇద్దరు, బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే ఉండగా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నారు. కాగా, ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు