Ashwini Vaishnaw: 200 రైల్వే స్టేషన్లకు ఆధునిక వసతులు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

Ashwini Vaishnaw: 200 రైల్వే స్టేషన్లకు ఆధునిక వసతులు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnaw: మరికొద్ది రోజుల్లో దేశంలోని 200 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఏర్పాటు కానున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో సోమవారం అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

Human Sacrifice: గంజాయి మత్తులో దారుణం.. నరబలి పేరుతో ఆరేళ్ల బాలుడి హత్య.. నిందితుల అరెస్ట్

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 200 రైల్వేస్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరించబోతున్నారు. రైల్వే స్టేషన్లలో ఓవర్ హెడ్ స్పేస్‌లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన వెయిటింగ్ లాంజెస్, ఫుడ్ కోర్టులతోపాటు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా అమ్యూజ్‌మెంట్ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించిన 47 రైల్వే స్టేషన్ల టెండర్ల ప్రక్రియ పూర్తైంది.

Online Betting Ads: ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం… నిషేధం విధిస్తూ నిర్ణయం

వీటిలో 32 రైల్వే స్టేషన్లలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే దేశంలో 400 వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి. వీటిలో వంద రైళ్లను మహారాష్ట్రలో తయారు చేస్తారు. పీఎం గతి శక్తి పథకం కింద జాతీయ రహదారులను, రైల్వే లైన్లను కలిపే ఏర్పాటు చేస్తున్నారు.