Operation Sindoor: గురిపెట్టి కొట్టారు.. దెబ్బకు ధ్వంసం.. అజ్మల్ కసబ్‌, డేవిడ్‌ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలపై భారత సైన్యం అటాక్.. నిమిషాల్లో అంతా ఖతం..

ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.

Ajmal Kasab and David Headley

Operation Sindoor: పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే కేంద్రాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని భారత్ అంచనా వేస్తోంది. అర్ధరాత్రి 1.05 నిమిషాల నుంచి 1.30 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను కూడా ధ్వంసం చేసింది.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై కేంద్రం ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు.. వాళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే..

26/11 ముంబయి ఉగ్రదాడులు 2008లో దేశమంతటినీ కుదిపేసిన విషయం తెలిసిందే. 2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌. అతన్ని 2012 నవంబర్ 21న ఉరితీశారు.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. ఆ 25 నిమిషాల్లోనే అంతా ఖతం.. కీలక విషయాలు వెల్లడించిన సైన్యం

ముంబై దాడుల వెనుక ఉన్న ఇద్దరు మాస్టర్ మైండ్స్‌లో తహవ్వుర్‌ రాణా, డేవిడ్‌ కోల్‌మన్ హెడ్లీ. అమెరికా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకొని ఎవరికీ దొరక్కుండా తప్పించుకోవాలని వీరద్దరూ చేయని ప్రయత్నం లేదు. అయితే వీరిలో ఒకడైన తహవ్వుర్ రాణాను ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ ఇండియాకు తీసుకొచ్చింది. డేవిడ్ హెడ్లీ మాత్రం ఇంకా అమెరికా జైల్లోనే ఉన్నాడు.

 

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతోపాటు కరల్న్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని, ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామని చెప్పారు.