Parliament
Parliament : పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండవ శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పార్లమెంట్ సమావేశాల ప్రారంభం (నవంబర్ 29) రోజు నిబంధనలు ఉల్లంఘించినందుకు రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ఇప్పుడు 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్ష పార్టీలు సభలో గందరగోళం సృష్టించాయి. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
చదవండి : Venkaiah Naidu On Omicron : ఒమిక్రాన్ గురించి ఆందోళన వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి- వెంకయ్యనాయుడు
ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ హక్కును హరించడమే అంటూ విపక్ష ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే క్షమాపణలు చెబితే.. సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఇదివరకే వెంకయ్యనాయుడు తెలిపారు. తాము తప్పు చేయలేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని విపక్షాలు అంటున్నాయి. తాజాగా ఈరోజు కూడా రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్య సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.
చదవండి : Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ఎంపీలు