Rajasthan: గెలిచిన 199 మంది ఎమ్మెల్యేల్లో 169 మంది కోటీశ్వరులే, 61 మందిపై క్రిమినల్ కేసులు

2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 199 మంది ఎమ్మెల్యేలలో 28 మంది (14%) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడ్డాయి. దీంతో పాటు ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రంలోని 199 మంది గెలిచిన అభ్యర్థుల ఆర్థిక, నేర, ఇతర వివరాలను విశ్లేషించారు.

క్రిమినల్ కేసులు
2023లో గెలిచిన 199 మంది అభ్యర్థుల్లో 61 (31%) మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 199 మంది ఎమ్మెల్యేలలో 46 (23%) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇందులో 44 (22%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 199 మంది ఎమ్మెల్యేలలో 28 మంది (14%) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.

పార్టీల వారీగా లెక్కలు చూస్తే.. బీజేపీకి చెందిన 115 మంది గెలిచిన అభ్యర్థుల్లో 35 మంది (30%) తమపై క్రిమినల్ కేసులున్నాయి. ఇక కాంగ్రెస్‌కు చెందిన 69 మంది గెలిచిన అభ్యర్థులలో 20 (29) మంది, భారత్ ఆదివాసీ పార్టీ విజేత అభ్యర్థుల ముగ్గురిలో ఇద్దరు, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఏకైక విజేత.. వీరితో పాటు ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులలో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

కోటీశ్వరులు
గెలిచిన 199 మంది అభ్యర్థులలో 169 మంది కోటీశ్వరులు. అంటే, మొత్తం ఎమ్మెల్యేల్లో 85 శాతం కోటీశ్వరులే. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశ్లేషించబడిన 199 మంది ఎమ్మెల్యేలలో 158 (79%) మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. పార్టీల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. 115 మందిలో 101 మంది (88%) గెలుపొందిన కోటీశ్వరుల అభ్యర్థులు అత్యధికంగా బీజేపీదే. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చెందిన 69 అభ్యర్థుల్లో 58 (84%) మంది, బీఎస్పీకి చెందిన ఇద్దరిలో ఒకరు, స్వతంత్రంగా గెలుపొందిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఏడుగురు కోటి రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలుపొందిన అభ్యర్థి సగటు ఆస్తి రూ.7.78 కోట్లు. 2018లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.7.39 కోట్లు.

ట్రెండింగ్ వార్తలు