Mim Mp
Asaduddin Owaisi : రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఒవైసీ ఈ విషయంపై మాట్లాడారు. నన్ను వారు సమావేశానికి ఆహ్వానించలేదు. ఒకవేళ నన్నువారు ఆహ్వానించినా నేను హాజరుకాను. అందుకు కాంగ్రెస్ పార్టీయేనే కారణం. దీనికితోడు మా గురించి చెడుగా మాట్లాడే TMC పార్టీకూడా ఓ కారణం అని ఒవైసీ అన్నారు.
Asaduddin Owaisi: ఒడిశాలో అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..
రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు, అధికార భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)పై ఐక్యంగా పోరాడేందుకు మమతా బెనర్జీ పలు ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఎనిమిది మంది కాంగ్రెసేతర ప్రతిపక్ష ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్(టిఆర్ఎస్), అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ (ఆప్), నవీన్ పట్నాయక్ (బిజెడి), పినరయి విజయన్ (సిపిఎం), హేమంత్ వంటి 19 రాజకీయ పార్టీల నాయకులను టీఎంసీ అధిష్టానం శనివారం ఆహ్వానించింది. సోరెన్ (JMM), M K స్టాలిన్ (DMK), ఉద్ధవ్ థాకరే (శివసేన నేతృత్వంలోని MVA) దేశ రాజధానిలో రాబోయే రాష్ట్రపతి ఎన్నికల వ్యూహాన్ని చర్చించేందుకు సమావేశం కానున్నారు.
Asaduddin Owaisi: ఆ ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: అసదుద్దీన్
ఇదిలాఉంటే ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో మమతా ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గోనున్నారు. ఆ పార్టీ నుంచి మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సింగ్ సూర్జేవాలా సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు కూడా బెనర్జీ ఆహ్వానం పంపారు, అయితే వారు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధులు పాల్గోనడం లేదని సమాచారం. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఆపార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే ఆప్ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి హెచ్‌డి దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్‌డి కుమారస్వామి, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.