Asaduddin Owaisi: ఒడిశాలో అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..

పూరీ జగన్నాథ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పూరీకి చెందిన సామాజిక, రాజకీయ నేతలు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Asaduddin Owaisi: ఒడిశాలో అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఎందుకంటే..

Asaduddin

Asaduddin Owaisi: పూరీ జగన్నాథ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పూరీకి చెందిన సామాజిక, రాజకీయ నేతలు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ ఆలయంపై ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం యాత్రికులు పూరీలో నిరసనలు చేపట్టారు.

Asaduddin Owaisi: ఆ ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: అసదుద్దీన్

మహారాష్ట్రలోని భివాండిలో గతనెలలో జరిగిన ర్యాలీలో AIMIM ఎంపీ అసదుద్దీన్ ప్రసంగిస్తూ.. బౌద్ధ ఆరాధన స్థలాన్ని ధ్వంసంచేసి శ్రీమందిరాన్ని నిర్మించారని పేర్కొంటూ స్వామి వివేకానంద ఈ విషయాన్ని చెప్పారంటూ ఉటకిస్తూ ఆరోపించారు. జ్ఞాన్‌వాపి మసీదుపై రాజకీయ దుమారం నడుస్తున్న సమయంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎంపీ వ్యాఖ్యలను ఖండిస్తూ హిందువులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. సోమవారం పూరీలో యాత్రికులు నిరసన చేపట్టారు. అసదుద్దీన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఓవైసీ తన వ్యాఖ్యలతో జగన్నాథ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ జగన్నాథ్ సేన, యువఅధివక్త సంఘ్ ఆధ్వర్యంలో సింగ్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ ప్రకటన కారణంగా వివిధ వర్గాల మధ్య ఉధ్రిక్తతలు తలెత్తేలా ఉన్నాయని జగన్నాథ సేన నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Asaduddin Owaisi: నుపూర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయాల్సిందే: అస‌దుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలపై జగన్నాథసేన కన్వీనర్ ప్రియదర్శన్ పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. మతం విషయంలో ప్రజలు ఘర్షణలకు దిగాలని అసదుద్దీన్ ఓవైసీ కోరుకుంటున్నారని ఆరోపించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఇంద్రద్యుమ్నుని కాలం నుండి చోడగంగదేవుని వరకు జగన్నాథ ఆలయం క్రమంగా రూపాంతరం చెందిందని అన్నారు. ఓవైసీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అన్నారు.