ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు ఇవాళ(డిసెంబర్-4,2019)ఉదయం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చిద్దూకి బెయిల్ మంజూరు అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చిదంబరాన్ని 106 రోజుల పాటు జైలులో ఉంచారని, ఇది ప్రతీకారంతో చేపట్టిన చర్య అని,పగతీర్చుకోవడంలో భాగమైన చర్య అని రాహుల్ విమర్శించారు.
చిదంబరానికి సుప్రీం బెయిల్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కోర్టు ముందు చిదంబరం తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేస్తారన్న నమ్మకం ఉందని రాహుల్ తెలిపారు. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం చిదంబరానికి బెయిల్ ఇచ్చింది. తీహార్ జైలు నుంచి ఇవాళే చిదంబరం బయటకు రానున్నారు. మనీ లాండరింగ్ కేసుపై ఈ ఏడాది ఆగస్టు 21న చిదంబరం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.