Haryana
Paddy Procurement Haryana: హరియాణా, పంజాబ్‌లో రైతుల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 2021, అక్టోబర్ 03వ తేదీ ఆదివారం కేంద్రం ఖరీఫ్ ధాన్యాల సేకరణ ప్రారంభించనుంది. దీనిపై.. హరియాణ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఓ ప్రకటన చేశారు. రైతుల ఆందోళన తీవ్రస్థాయికి చేరడంతో ఖట్టర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేంద్రమంత్రి అశ్విన్‌చౌబేతో భేటి అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆదివారం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ధాన్యం కొనుగోలు చేపట్టాలని హరియాణాలో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కర్నల్‌లో వేలాది మంది రైతులు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఇంటిని ముట్టడించారు.
Read More : Hyderabad : ఎలర్జీ సమస్యలతో బాధ పడుతున్నారా..డోంట్ వర్రీ
సీఎం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు వాటర్ కానన్‌లతో రైతులను చెదరగొట్టారు. హరియాణలోని పంచకులలో రైతులు రెచ్చిపోయారు. ఆందోళనలో భాగంగా ట్రాక్టర్లపై వచ్చిన రైతులు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ముందుకెళ్లే యత్నం చేశారు. పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ జరిపి రైతులను చెదరగొట్టారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై కేంద్రం జాప్యం చేస్తోందని రైతులు ఆందోళనకు దిగారు.
Read More : TRS : నేతలకు క్లాస్ తీసుకున్న మంత్రి కేటీఆర్?
హరియాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇళ్లను రైతులు టార్గెట్ చేశారు. అంబాలాలో బీజేపీ ఎమ్మెల్యే అసీమ్ గోయెల్ ఇంటిని ముట్టడించారు. భారీ ఎత్తున వాహనాలపై వచ్చిన రైతులు బారికేడ్లను తోసుకుని ఎమ్మెల్యే ఇంటివైపు దూసుకెళ్లారు. పెద్దసంఖ్యలో పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలుచుని రైతులను అడ్డుకున్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ 1 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రుతుపవనాల ఆలస్యం కారణంగా కేంద్రం అక్టోబర్ 11కి పొడిగించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హరియాణ, పంజాబ్ రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అక్టోబర్ 3 నుంచి హరియాణ, పంజాబ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైంది. ఇప్పటికే రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.