TRS : నేతలకు క్లాస్ తీసుకున్న మంత్రి కేటీఆర్?

టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్.. తమ పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారా? అసెంబ్లీలో తనను కలిసిన నేతలకు క్లాస్ తీసుకున్నారా?

TRS : నేతలకు క్లాస్ తీసుకున్న మంత్రి కేటీఆర్?

Trs Minister Ktr

Minister KTR : టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్.. తమ పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారా? అసెంబ్లీలో తనను కలిసిన నేతలకు క్లాస్ తీసుకున్నారా? బాధ్యత ఉండక్కర్లేదా అని మందలించారా? ఇంతకీ కేటీఆర్ అసంతృప్తికి కారణమేంటి? అసలే ఉప ఎన్నిక సీజన్‌. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే విపక్ష నేతల వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు లైట్‌ తీసుకుంటున్నారట.

Read More : Gold Price: భారీగా పెరిగిన వెండి ధర.. అదే దారిలో బంగారం!

ఇద్దరు ముగ్గురు మినహా విపక్షాలకు గట్టిగా ఎవరూ కౌంటర్ ఇవ్వట్లేదట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనను కలిసిన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇదే విషయమై కేటీఆర్ చురకలంటించారట. ప్రతిపక్ష పార్టీ విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీకు లేదా అని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పలువురు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ నుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా… ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతున్నారని కేటీఆర్ తనను కలిసిన నేతలతో అన్నారట.

Read More : Wuling Mini EV: నానో ఇన్‌స్పిరేషన్‌తో బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ధర తక్కువే!

చీఫ్ విప్, విప్‌లతో కూడా ఇవే వ్యాఖ్యలు చేసినట్టు గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని నేతలు సూచించారు కేటీఆర్.  ప్రతిపక్ష పార్టీల నిరాధార ఆరోపణలను ఎండగట్టాలన్న కేటీఆర్ సూచనలతో టీఆర్ఎస్‌ నేతలు మాటల దాడికి సిద్ధమవుతున్నారట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నారట.