Sindhutai Sapkal : అమ్మగా పిలుచుకొనే..సింధుతాయ్ కన్నుమూత…మోదీ సంతాపం

ప్రముఖ సంఘ సేవకురాలు...పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు.

Modi

Sindhutai Sapkal : ప్రముఖ సంఘ సేవకురాలు…పద్మశ్రీ అవార్డు గ్రహీత..సింధుతాయ్ సప్కాల్ కన్నుమూశారు. ఈమె వయస్సు 74 సంవత్సరాలు. అనాథ పిల్లలు అమ్మగా పిలుచుకునే సింధు…గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింధుకు…మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Read More : Marathon Disruption : కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో అపశ్రుతి

మహారాష్ట్రలో వార్ధా జిల్లాలో జన్మించిన సింధుతా్ పుణెలో సన్మతి బాల్ నికేతన్ అనే అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. దాదాపు వేయి మందికి పైగానే..అనాథ పిల్లలను దత్తత తీసుకుని చేరదీశారు. ఈమె చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. 2010 మరాఠీలో మి సింధుతాయ్ సప్కాల్ బోల్టే పేరిట సింధుతాయ్ బయోపిక్ విడుదలైంది.

Read More : Ap Omicron : ఏపీలో ఒమిక్రాన్ కల్లోలం.. 24కి పెరిగిన కేసుల సంఖ్య

సింధుతాయ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సమాజానికి చేసిన సేవలతో సింధుతాయ్ ఎప్పటికీ గుర్తిండిపోతారని, ఆమె కృషితో చాలా మంది పిల్లలు ప్రస్తుతం ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. సింధుతాయ్ మృతి తీరని లోటుగా అభివర్ణించిన మోదీ…ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు తెలిపారు.