Pakistan flag: ఉత్తరాఖండ్‌లో పాకిస్థాన్ జెండా, బ్యానర్ల కలకలం

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కనపడడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. లేత ఆకుపచ్చ రంగు బెలూన్లకు వేలాడుతూ ఆ జెండా, బ్యానర్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Pakistan flag: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కనపడడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. లేత ఆకుపచ్చ రంగు బెలూన్లకు వేలాడుతూ ఆ జెండా, బ్యానర్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఓ బ్యానర్ పై ఉర్దూలో రాతలు ఉన్నాయని, మరో దానిపై ‘ఎల్‌బీఏ’ (క్యాబినెట్ లాహోర్ బార్ అసోసియేషన్) అని రాసి ఉందని ఉత్తరకాశీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పన్ యదువంశీ చెప్పారు. తుల్యాడా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జెండా, బ్యానర్లు బెలూన్లకు కట్టి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

దీనిపై తాము ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని చెప్పారు. అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండా, బ్యానర్లు లభ్యమైన విషయంపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. ఆ జెండా, బ్యానర్లకు మొదట తుల్యాడా గ్రామస్థులు గుర్తించారని, దీనిపై తమకు సమాచారం అందించారని ధరాసు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో కమల్ కుమార్ లుంథీ చెప్పారు.

Nitish Kumar: ఇటువంటి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడతారు?: సీఎం నితీశ్

ట్రెండింగ్ వార్తలు