Ujjain Pakistan Zindabad Slogans : ఉజ్జయినిలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు

మొహ్రం పండుగ సందర్భంగా ఉజ్జయినిలో జరిగిన ఊరేగింపులో కొంతమంది పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు..

pakistan zindabad slogans in ujjain దేశవ్యాప్తంగా మొహ్రం పండుగ జరుగుతోంది. ఈసందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మొహ్రం ఊరేగింపులో కొంతమంది పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు స్థానికంగా కలకలం రేపాయి. దీంతో పోలీసులు కొంతమందిని అరెస్ట చేసి ఉజ్జయిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మొహ్రం పండుగను పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఊరేగింపులకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.అయినా కొంతమంది ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంప ఊరేగింపు చేపట్టారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగటంతో చాలామంది పారిపోయారు. వారిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

మొహర్రం పండుగ సందర్భంగా గుర్రంపై ఊరేగింపుకు అనుమతి లేదని పోలీసులు చెప్పటంతో ఆందోళన కారులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారని కొంతమంది స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) సత్యేంద్ర శుక్లా మాట్లాడుతు..దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం దేశ ద్రోహం కిందకు వస్తుందని కాబట్టి ఆందోళన కారులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 (A) (రాజద్రోహం), 153 (అల్లర్లకు ప్రేరేపించడం)వంటి కేసులతో పలు కేసులు నమోదు చేశామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు