Pakistan Flight: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం.. దాదాపు పది నిమిషాలు చక్కర్లు.. అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం మే4న భారత గగనతలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో పైలెట్ విమానాన్ని 20వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు.

Pakistani flight

Pakistan Flight: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం ప్రవేశించింది. దాదాపు పది నిమిషాల పాటు ఆ విమానం భారత గగనతలంపైనే ప్రయాణించిందిన. మే 4వ తేదీ రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ నుండి తిరిగి వస్తున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంలో విఫలమైంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీ వర్షం కురవడంతో లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది భారత గగనతలంలో దాదాపు పదిన నిమిషాల పాటు ప్రయాణించింది.

Pakistan: పాకిస్థాన్‌లో దారుణం.. ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృతి

భారత గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలెట్ విమానాన్ని 20వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు. ఏడు నిమిషాలు భారత గగనతలంలో ప్రయాణించిన విమానం.. ఆ తరువాత పంజాబ్‌లోని ఝగియాన్ నూర్ మహమ్మద్ గ్రామ సమీపంలో పాకిస్థాన్ గగనతలంలోకి తిరిగి వెళ్లింది. పాకిస్థాన్ పరిధిలోని పంజాబ్‌ రాష్ట్రంలో కసూర్ జిల్లాలోని డోనామబ్చోకి, చాంట్, ధుప్సారి కసూర్, ఘటి కలంజర్ గ్రామాల మీదుగా భారత గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది. మూడు నిమిషాల తరువాత భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం లఖాసింగ్ వాలా హితార్ గ్రామం నుండి మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో విమానం 23వేల అడుగుల ఎత్తులో 320 కి.మీ వేగంతో ఉంది.

Woman dancing in flight : విమానం మధ్యలో అమ్మాయి డ్యాన్స్.. మెట్రోలు సరిపోలేదా? అంటూ నెటిజన్లు ఫైర్

భారత భూభాగంలో పది నిమిషాల పాటు మొత్తం 120 కిలో మీటర్లు విమానం ప్రయాణించింది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనల మేరకు పైలట్ గో-రౌండ్ విధానాన్ని ప్రారంభించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో పాటు, తక్కువ ఎత్తులో ఉన్న కారణంగా విమానం దారితప్పిపోయిందని నివేదికలో చెప్పబడింది.