Air India: విమానం నడుపుతూ కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని అనుమతించిన పైలట్

Air India: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పైలట్ పై క్షమశిక్షణ చర్యలే కాకుండా, అతడి లైసెన్స్ పై సస్పెన్షన్ లేదా దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

Air India: విమానం నడుపుతూ కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని అనుమతించిన పైలట్

Air India Flight

Air India: దుబాయి నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ఓ పైలట్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడడంతో అతడిపై విచారణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణ ప్రారంభించింది. విమానం గాలిలో ఉన్న సమయంలో దాని పైలట్ తన స్నేహితురాలిని కాక్ పిట్ లోకి రమ్మనడమే కాకుండా అందులోనే ఆమెను చాలా సేపు ఉంచాడు.

ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈ ఘటన నిబంధనలను ఉల్లంఘించడమేనని సంబంధిత అధికారులు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆ విమానంలో తన స్నేహితురాలు ప్రయాణిస్తుండడంతో ఆమెను పైలట్ కాక్ పిట్ లోకి ఆహ్వానించాడని అధికారులు గుర్తించారు. విమానం దుబాయి నుంచి బయలుదేరిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకుంది.

దాదాపు మూడు గంటల పాటు ఆమె కాక్ పిట్లోనే ఉంది. ఇది భద్రతా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, విమానం, ప్రయాణికుల రక్షణ విషయాన్ని కూడా గాలికి వదిలేసినట్లేనని అధికారులు అన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పైలట్ పై క్షమశిక్షణ చర్యలే కాకుండా, అతడి లైసెన్స్ పై సస్పెన్షన్ లేదా దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని వివరించారు.

విచారణలో తేలే విషయాలను బట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎయిర్ ఇండియా విమానాలు వరుసగా అనేక వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లోకెక్కుతున్నాయి. అవి చాలవన్నట్లు ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

COVID-19 Cases: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు