సీఏఏ అమలుపై పాకిస్థాన్ మహిళ ప్రశంసలు.. మోదీ మాట నిలబెట్టుకున్నారని కితాబు

పౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై సీమా హైదర్ హర్షం వ్యక్తం చేశారు.

Seema Haider Welcomes CAA: సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని పాకిస్థానీ జాతీయురాలు సీమా హైదర్ స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. సీమా హైదర్ గతేడాది వార్తల్లో నిలిచారు. తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. హిందూ మతాన్ని స్వీకరించి గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను ఆమె వివాహం చేసుకున్నారు.

పౌరసత్వ (సవరణ) చట్టం అమలు నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం ముందడుగు వేయడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. తాజా నిర్ణయంతో తనకు భారత పౌరసత్వం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె వెంటనే పౌరసత్వం దక్కకపోవచ్చు. ఎందుకంటే 2014, 31తేదీకి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు మాత్రమే తక్షణమే పౌరసత్వం లభిస్తుంది.

“భారత ప్రభుత్వం ఈ రోజు మన దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. పౌరసత్వ (సవరణ) చట్టాన్ని అమలు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మోదీజీ ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకున్నారు. నేను వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. వారికి నా కృతజ్ఞతలు”అని సీమా హైదర్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆమె భర్త, సచిన్‌తో పాటు తన నలుగురు పిల్లల్లో ముగ్గురు సీమాతో పాటు వీడియోలో కనిపించారు.

Also Read: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా?

 

ట్రెండింగ్ వార్తలు