ఎన్నాళ్లకెన్నాళ్లకు : పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వం

పాకిస్థాన్ మహిళకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది. 35 సంవత్సరాల క్రితం అప్లై చేసుకున్న 55 ఏళ్ల పాకిస్థాన్ మహిళ జుబేదాకు ఎట్టకేలకు భారత్ పౌరసత్వాన్ని ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే..జుబేదా పాకిస్థాన్లోని భారత్ చెందిన ముజఫర్‌నగర్ జిల్లాలోని యోగేందర్‌పూర్ వాసి అయిన మహ్మద్ జావెద్‌ను 1994 లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన వెంటనే జుబేదా భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకుంది. కానీ అప్పట్లో ఉన్న లీగల్ సమస్యల కారణంగా జుబేదాకు పౌరసత్వం లభించలేదు. ఆనాటి నుంచి జుబేదా లాంగ్ టర్మ్ వీసాపై భారత్‌లోనే ఉంటోంది.
ఈ క్రమంలో జుబేదాకు భారత పౌరసత్వం వచ్చిందని ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జుబేదా భారతీయురాలేనని ఇక ఆమె ఆధార్, రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
జుబేదాకు 30 సంవత్సరాల వయస్సున్న రుమేషా, 26 ఏళ్ల జుమేషా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారంగా చూస్తే..పాకిస్థాన్ దేశానికి చెందిన మొత్తం 25 మంది భారతీయులను వివాహమాడి..ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో లాంగ్ టర్మ్ వీసాపై నివాసముంటున్నారు.