#Modigoback – చైనీస్ భాషలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

భారతదేశ ప్రధాని, చైనా దేశాదినేతల మీటింగ్ ఖరారైన సమయంలో సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. శుక్రవారం తమిళనాడులోని ప్రాంతాలు సందర్శించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వస్తుండటంతో మోడీ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో #Modigoback అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. 

దీనిని వెంటనే గమనించిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం అధికారులకు సమాచారం ఇచ్చింది. వాటిని పోస్ట్ చేసిందెవరని వాకబు చేయగా పాకిస్తాన్ నుంచి అని తెలిసింది. 25 మంది వ్యక్తులు పాకిస్తాన్ ప్రాంతం నుంచి #Modigoback అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేశారు. ఉదయం నుంచి భారత్‌కు వ్యతిరేకంగా పలు ట్వీట్లు చేశారు. 

చెన్నైలోని మమల్లాపురంలో మోడీ-జిన్ పింగ్ మీటింగ్‌కు కొద్ది నిమిషాల ముందే ఇది జరిగింది. ఈ ట్వీట్లు చేసిన వారు ఇంగ్లీషులోనే కాకుండా చైనీస్ భాషలో ట్వీట్ చేసి అదే హ్యాష్ ట్యాగ్ ను జత  చేస్తున్నారని వెల్లడైంది.